త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Visa-Free Entry | భార‌తీయుల‌కు షాకిచ్చిన మ‌లేషియా.. వీసా ఫ్రీ ఎంట్రీ ర‌ద్దు

Visa-Free Entry | భార‌తీయుల‌కు వీసా ఫ్రీ ఎంట్రీని ర‌ద్దు చేస్తూ మ‌లేషియా (Malaysia) ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జనవరి 1 నుంచి భారతీయ పౌరులకు కల్పిస్తున్న వీసా-ఫ్రీ ఎంట్రీ (Visa-Free Entry) సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర‌క‌టించింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిసెంబర్ 1 నుంచి అధికారిక MyVISA ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వీసా దరఖాస్తులను స్వీకర‌ణ (visa applications) ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది.

D

National | Published On Nov 19, 2026, 3.29 pm IST

Visa-Free Entry | భార‌తీయుల‌కు షాకిచ్చిన మ‌లేషియా.. వీసా ఫ్రీ ఎంట్రీ ర‌ద్దు
Advertisement

Visa-Free Entry | త్రినేత్ర న్యూస్ : భార‌త పౌరుల‌కు (Indians) మ‌లేషియా (Malaysia) ప్ర‌భుత్వం గ‌ట్టి షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారతీయ పౌరులకు కల్పిస్తున్న వీసా-ఫ్రీ ఎంట్రీ (Visa-Free Entry) సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణ‌యంతో 2027 జనవరి నుంచి మలేషియాకు వెళ్లే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఆ దేశంలోకి ప్రవేశించడానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసాను పొందాల్సి ఉంటుంది.

నవంబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో మలేషియా ఇమిగ్రేషన్ విభాగం (JIM) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి భారతీయులకు వీసా మినహాయింపు సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదని తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిసెంబర్ 1 నుంచి అధికారిక MyVISA ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వీసా దరఖాస్తులను స్వీకర‌ణ (visa applications) ప్రారంభించ‌నున్న‌ట్లు మ‌లేషియ‌న్ ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. వీసా ప్రాసెసింగ్ రుసుము పూర్తిగా నాన్-రిఫండబుల్ అని ఇమిగ్రేషన్ విభాగం గుర్తు చేసింది. ద‌రఖాస్తు ఆమోదం పొందినా లేదా తిర‌స్క‌ర‌ణ‌కు గురైనా ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. మలేషియా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలను ఎప్పుడైనా సవరించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.

వీసా దుర్వినియోగంపై భార‌త్ హెచ్చ‌రిక‌ల వేళ‌

పర్యాటకం కోసం ఉద్దేశించిన 30 రోజుల వీసా-రహిత సౌకర్యాన్ని కొందరు అక్రమంగా ఉద్యోగాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళనల నేపథ్యంలో మ‌లేషియా ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని మలేషియాలో ఉద్యోగాల వేట కోసం ఉపయోగించవద్దని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ భారతీయ పౌరులను హెచ్చరిస్తూ రెండు నెల‌ల క్రితం కీల‌క‌ అడ్వైజరీ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌లేషియా ప్ర‌భుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం. డిసెంబర్ 31 వ‌ర‌కూ మలేషియా వెళ్లే వారికి పాత నిబంధనల ప్రకారమే 30 రోజుల పాటు వీసా-ఫ్రీ ప్రవేశం అందుబాటులో ఉండ‌నుంది. రాబోయే నూత‌న సంవ‌త్స‌రం సందర్భంగా సెల‌వుల‌కు మ‌లేషియా వెళ్లాల‌నుకునే వారు ఈ కొత్త నిబంధ‌న‌లను దృష్టిలో ఉంచుకొని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటే మంచిది.

భారీగా పెరిగిన భార‌తీయ ప‌ర్యాట‌కులు

మ‌లేషియా ప్ర‌భుత్వం 2023 డిసెంబ‌ర్ నుంచి భార‌తీయుల‌కు వీసా ఫ్రీ ఎంట్రీ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. కొవిడ్ మ‌హ‌మ్మారి త‌ర్వాత పర్యాటకాన్ని పెంచడానికి ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అప్ప‌టి నుంచి ఆ దేశానికి వెళ్లే భార‌తీయ ప‌ర్యాట‌కుల సంఖ్య భారీగా పెరిగింది. కొవిడ్ విజృంభ‌ణ‌కు ముందు 2019లో కేవ‌లం 7.3 లక్ష‌ల‌కు పైగా ఉన్న భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య‌.. 2024 నాటికి 13.6 ల‌క్ష‌ల‌కు పెరిగింది. 2025లో 15.6 ల‌క్ష‌ల మంది వీసా ఫ్రీ సౌక‌ర్యాన్ని పొందారు. ఇక 2026 జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య 7.4 ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కులు మ‌లేషియాను సంద‌ర్శించారు. వీసా ఫ్రీ ఎంట్రీ గ‌డువు ముగిసే లోపు ఆ సంఖ్య 21 ల‌క్ష‌ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. పర్యాటక వీసా మినహాయింపును ఉపయోగించుకుని ఉద్యోగాల వేటలో మలేషియాకు వచ్చే భారతీయుల సంఖ్య పెరగడం, గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడం (Overstaying)పై 2026 సెప్టెంబర్‌లో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌లేషియా ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం.

Also Read..

'ఇండియా ఫస్ట్' నినాదంతో ముందుకు సాగాలి.. పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు

ద‌మ్ముంటే రాజీనామా చెయ్‌.. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డికి పున్నా కైలాశ్ స‌వాల్‌

ఓటర్ల జాబితా సవరణపై భగ్గుమన్న మేధావులు.. 22న హైదరాబాద్‌లో ప్రశాంత్ భూషణ్ కీలక సదస్సు!

Advertisement
Advertisement