త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Security Lapse | సీఎం విజయ్ భద్రతలో భారీ లోపం.. కాన్వాయ్ దాటి దూసుకొచ్చిన వ్యక్తి..!

Security Lapse | తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్‌ భద్రతలో తీవ్ర లోపం చోటుచేసుకుంది. శుక్రవారం చెన్నైలోని కొళత్తూరులో ఆయన రోడ్‌వాక్‌ చేస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం వైపు దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు కలకలం రేగింది.

P

National | Published On Nov 13, 2026, 6.27 pm IST

Security Lapse | సీఎం విజయ్ భద్రతలో భారీ లోపం.. కాన్వాయ్ దాటి దూసుకొచ్చిన వ్యక్తి..!
Advertisement

Security Lapse | తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్‌ భద్రతలో తీవ్ర లోపం చోటుచేసుకుంది. శుక్రవారం చెన్నైలోని కొళత్తూరులో ఆయన రోడ్‌వాక్‌ చేస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం వైపు దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న విజయ్‌ కొళత్తూరులో కాన్వాయ్‌ నుంచి దిగి ప్రజల మధ్య నడిచారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం గుమిగూడారు. మంత్రి కే జగదీశ్వరి కూడా ఆయన వెంట నడుస్తున్నారు. ఇంతలో జనంలో నుంచి ఓ వ్యక్తి ఒక్కసారిగా ముందుకొచ్చి, మంత్రిని దాటుకుని విజయ్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వైరల్‌గా మారిన వీడియో

సీఎం వద్దకు వ్యక్తి దూసుకొచ్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వివరాలు, సీఎం వద్దకు రావడానికి గల కారణాలపై విచారిస్తున్నారు. అయితే, అతడి ఉద్దేశం ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. ఘటన అనంతరం విజయ్‌ తన రోడ్‌వాక్‌ను కొనసాగించారు. అనంతరం మదుమానగర్‌లోని చెన్నై కార్పొరేషన్‌ మిడిల్‌ స్కూల్‌కు చేరుకున్న విజయ్‌.. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. చిన్నారులకు కేకులు, గ్రీటింగ్‌ కార్డులు పంపిణీ చేశారు. తరగతి గదులను సందర్శించి వారితో సరదాగా గడిపారు. రాష్ట్రవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. నటుడి నుంచి ముఖ్యమంత్రిగా మారిన విజయ్‌ బహిరంగ కార్యక్రమాలకు భారీగా జనం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం భద్రతా వలయాన్ని దాటి ఓ వ్యక్తి సమీపానికి రావడం భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Advertisement
Advertisement