త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Traffic Flyovers | హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. ఆ 3 ఏరియాల్లో కొత్త ఫ్లైఓవర్లు

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఆ మూడు కీలక ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

J

Hyderabad | Published On Nov 19, 2026, 3.32 pm IST

Hyderabad Traffic Flyovers | హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. ఆ 3 ఏరియాల్లో కొత్త ఫ్లైఓవర్లు

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బాలానగర్, కూకట్‌పల్లి, తుర్కయంజాల్–సాగర్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్లు మంజూరు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందజేసినట్లు తెలిపారు. నగర అభివృద్ధికి ఎంతో కీలకమైన హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు.

Advertisement
  • హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్
  • ఆ మూడు ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లకు డిమాండ్
  • RRR పై ఈటల కీలక విజ్ఞప్తి

Hyderabad Traffic Flyovers | త్రినేత్ర న్యూస్ : నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక అడుగు వేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సమావేశంలో పాల్గొన్న ఆయన, నగరంలోని మూడు అత్యంత రద్దీ ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

ఆ మూడు ప్రాంతాలు ఇవే..

నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు బాలానగర్, కూకట్‌పల్లి, తుర్కయంజాల్–సాగర్ రోడ్డు మార్గాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. గతంలో కొంపల్లి, ఎల్బీనగర్, ఆరంఘర్ ఫ్లైఓవర్లను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ఫ్లైఓవర్లకు సంబంధించిన ప్రతిపాదనలను (ప్రపోజల్స్) రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తాను కలిసి ఇప్పటికే గడ్కరీకి అందజేసినట్లు వెల్లడించారు.

Hyderabad Traffic Relief New Flyovers Proposed in These 3 Key Areas

ట్రిపుల్ ఆర్ (RRR) అనుమతులపై విజ్ఞప్తి

హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు, నగర విస్తరణకు ఎంతో కీలకమైన 'రీజినల్ రింగ్ రోడ్డు' (RRR) ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఈటల కోరారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తే హైదరాబాద్ మౌలిక సదుపాయాల రంగంలో మరింత వేగంగా దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనితీరును ఈటల రాజేందర్ ప్రత్యేకంగా కొనియాడారు. గడ్కరీ అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే 'ప్రో-యాక్టివ్, పాజిటివ్' మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. పార్లమెంట్‌లో ఏ పార్టీ ఎంపీ రహదారులపై ప్రశ్నలు అడిగినా, గడ్కరీ ఇచ్చే సమాధానాలు అందరినీ సంతృప్తిపరిచేలా ఉంటాయని పేర్కొన్నారు.

Hyderabad Traffic Relief New Flyovers Proposed in These 3 Key Areas

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం, సెంట్రల్ రోడ్ ఫండ్స్ (CRF) కేటాయింపుల్లో కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని ఈటల అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వేలు, విమానాశ్రయాలు, రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని బలంగా నమ్మే నాయకత్వం కేంద్రంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిష్టాత్మకమైన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొంటూ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి గడ్కరీ సహకారం ఇలాగే కొనసాగాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు.

Advertisement
Advertisement