Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు – హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
"జనవరి 12 విడుదల" ప్రమోషన్స్‌ను హీరోయిన్ల పాటతో మొదలుపెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కీర్తి సురేష్, కృతిశెట్టి నటించిన దివికి దివికి అనే పాటకు సంబంధించిన ప్రోమోను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మాస్ స్టెప్పులు, ఎనర్జీతో ఇద్దరు హీరోయిన్లు ఆకట్టుకున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు.
Entertainment | Published On Nov 20, 2026, 5.37 pm IST
Krithi Shetty | ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్ట్రాటజీ భిన్నంగా ఉంటుంది. ఇన్నోవేటివ్ ఐడియాలతో చాలా తక్కువ బడ్జెట్‌లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువే బజ్, రీచ్ తీసుకొస్తుంటారు. తనదైన శైలి వినోదాన్ని కూడా ప్రమోషన్స్‌లో జోడిస్తుంటారు. తన నెక్స్ట్ మూవీ "జనవరి 12 విడుదల"లో ఇదే రూట్‌ను ఫాలో అవుతున్నారు.
దళపతి సీన్ రీక్రియేట్
ఇటీవలే రజనీకాంత్ దళపతి సీన్‌కు రీక్రియేట్ చేస్తూ ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా శుక్రవారం ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దివికి దివికి అంటూ సాగిన ఈ పాటలో హీరోయిన్లు కీర్తి సురేష్, కృతిశెట్టి కనిపించారు. వీరిద్దరి మాస్ స్టెప్పులు ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచాయి. కలర్‌ఫుల్‌గా ఈ సాంగ్ సాగింది. ఈ ప్రోమోలో కీర్తి సురేష్, కృతిశెట్టి చీరకట్టులో కనిపించారు. సంక్రాంతి సందడి ఇప్పుడే కనిపిస్తుందని ప్రోమోను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. శనివారం ఫుల్‌సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ట్రెండ్‌కు భిన్నంగా...
సాధారణంగా హీరోల పరిచయ గీతాలు, స్పెషల్ సాంగ్స్ ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేస్తుంటారు. ఈ ట్రెండ్‌కు భిన్నంగా హీరోయిన్ల పాటతో జనవరి 12 విడుదల ప్రమోషన్స్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
మల్టీస్టారర్ మూవీ...
ఈ మల్టీస్టారర్ సినిమాలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్నారు. వీరిద్దరు ఈ సినిమాలో బావబావమరిదిగా కనిపించబోతున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Get ready girls, this one's for you💥
Let's go #DivikiDiviki 🔥
Full Lyrical out TOMORROW at AM ❤️🔥A @gvprakash Musical 🎵
Lyrics by @IananthaSriram#January12Vidudala Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) November 20, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..






