BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
BMS | రవాణా కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ తెలిపారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, సామాజిక భద్రత కల్పనతో పాటు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని వెల్లడించారు.
- సంక్షేమ బోర్డు, ప్రమాద బీమా, సామాజిక భద్రతకు హామీ
- కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, నితిన్ గడ్కరీతో బీఎంఎస్ ప్రతినిధుల భేటీ
- భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్
BMS | రవాణా కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ తెలిపారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, సామాజిక భద్రత కల్పనతో పాటు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ నెల 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల మహా ధర్నాలో దేశవ్యాప్తంగా వేలాది మంది రవాణా కార్మికులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ధర్నా సందర్భంగా బీఎంఎస్ ప్రతినిధి బృందం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసి కార్మికుల సమస్యలను వివరించింది. డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, మెకానిక్‌లకు ప్రమాద బీమా, దేశవ్యాప్తంగా రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, లారీలు, ట్రక్కులకు ఏసీ క్యాబిన్లు వంటి డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు రవిశంకర్ తెలిపారు.

ప్రైవేట్ కార్మికులకు సామాజిక భద్రత
ఆటో, ఈ-రిక్షా, టాక్సీ, క్యాబ్, లారీ, ట్రక్ డ్రైవర్లు, హెల్పర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ పరిధిలో వారికి ప్రయోజనాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. దీనిపై త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా నిబంధనల సడలింపు, త్రీ వీలర్లను ఎల్ఎంవీ నిర్వచనం నుంచి మినహాయించడం, ఆటో కార్మికులకు రుణ సదుపాయాల కల్పనపై చర్చించినట్లు రవిశంకర్ వెల్లడించారు. ప్రభుత్వ బస్సులకు టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగుల సమస్యలపైనా హామీ
మహిళా రవాణా ఉద్యోగులకు అర్ధరాత్రి, తెల్లవారుజామున విధుల కేటాయింపుతో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర కార్మిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీలు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. ప్రసూతి ప్రయోజనాల చట్టం, చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యాలను పక్కాగా అమలు చేసేలా సూచనలు చేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ మహా ధర్నాలో కేరళ, తమిళనాడు, ఉత్తర బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఎంఎస్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవీంద్ర హింటే నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీ సురేంద్రన్, వల్లభ్‌భాయ్ వచాని, కనక్ సింగ్ గోహిల్, సంజయ్ పండిట్, కైలాష్ మాలిక్, యోగేష్ శర్మ, అల్లూరి రవిశంకర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..






