Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
Anthropic Shares | అమెరికా స్టాక్ మార్కెట్లలో చారిత్రాత్మక ఐపీఓతో అరంగేట్రం చేసిన ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లకు రెండో రోజే ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఐపీఓ ధరతో పోలిస్తే ఒక దశలో 39 శాతం వరకు పెరిగిన షేర్లు, శుక్రవారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 6 శాతానికి పైగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ఏఐ రంగం భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి కారణమయ్యాయి.
Anthropic Shares | అమెరికా స్టాక్ మార్కెట్లలో చారిత్రాత్మక ఐపీఓతో అరంగేట్రం చేసిన ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లకు రెండో రోజే ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఐపీఓ ధరతో పోలిస్తే ఒక దశలో 39 శాతం వరకు పెరిగిన షేర్లు, శుక్రవారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 6 శాతానికి పైగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ఏఐ రంగం భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి కారణమయ్యాయి.
6.34 శాతం తగ్గిన షేర్ ధర..
ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ షేర్లు శుక్రవారం అమెరికా మార్కెట్ల ప్రారంభానికి ముందే భారీగా నష్టపోయాయి. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో షేరు ధర 6.34 శాతం తగ్గి 91.01 డాలర్లకు చేరుకుంది. గురువారం నాస్‌డాక్‌లో అరంగేట్రం చేసిన సందర్భంగా కంపెనీ షేర్లు ఐపీఓ ధర 83 డాలర్ల నుంచి ఒక దశలో 39 శాతం వరకు పెరిగాయి. అయితే ఆ లాభాల్లో సగానికి పైగా ఆవిరై, ట్రేడింగ్ ముగిసే సమయానికి 97.17 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. అధిక విలువతో కంపెనీ మార్కెట్లోకి రావడం, ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ, పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం షేర్లపై ఒత్తిడి పెంచాయి. సింగపూర్‌కు చెందిన రీడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ జెరాల్డ్ గాన్ మాట్లాడుతూ, ఏఐ ర్యాలీకి మద్దతుగా నిలిచిన చివరి ప్రధాన అంశం కూడా బలహీనపడుతున్నట్లు కనిపిస్తోందని, మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం తీవ్ర ప్రతికూలంగా ఉందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి..
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మూడేళ్లకు పైగా కాలంలో అత్యంత సుదీర్ఘ నష్టాల పరంపర దిశగా ప్రపంచ మార్కెట్లు పయనిస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల పతనం ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ 225 సూచీ 4.16 శాతం, టోపిక్స్ 2.4 శాతం, దక్షిణ కొరియా కోస్పి 3.71 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 సూచీ 1.13 శాతం పడిపోయాయి. ముఖ్యంగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ షేర్లు 14.5 శాతం క్షీణించాయి. ఆగస్టు 2024 తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్‌బ్యాంక్‌కు, ఓపెన్‌ఏఐలో ఉన్న పెట్టుబడుల కారణంగా నష్టభయాలు పెరుగుతున్నాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఏఐ ప్లాట్‌ఫామ్‌లపై ఆందోళన..
మరోవైపు, అమెరికా టెక్నాలజీ రంగంలో జెన్సన్ హువాంగ్ రాజీనామాపై నెలకొన్న ఆందోళనలు, మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం వల్ల ఏఐ పరిశ్రమ నియంత్రణ విధానాల్లో మార్పులు వస్తాయనే అంచనాలు కూడా మార్కెట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే టెక్నాలజీ షేర్లలో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ ఐపీఓ అరంగేట్రం తర్వాత వచ్చిన పతనం ఏఐ కంపెనీల విలువలపై పెట్టుబడిదారులు పునరాలోచన చేస్తున్నారనే సంకేతాలిస్తోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
నవంబర్ 20, 2026

Anthropic IPO | నేడే ఆంథ్రోపిక్ ఐపీఓ లిస్టింగ్.. భారతీయులు షేర్లను ఎలా కొనవచ్చు..?
నవంబర్ 19, 2026

Anthropic IPO | ఆంథ్రోపిక్ ఐపీఓకు భారీ డిమాండ్.. ఆరు రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్.. తేదీ ఎప్పుడంటే..?
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే



