Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
Rajagopal Reddy | నిన్న సిద్దిపేట సభ (Siddipet Meeting) లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన తీరుపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ప్రజలకు మేలు చెయ్
- సీఎంకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కౌంటర్
Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: నిన్న సిద్దిపేట సభ (Siddipet Meeting) లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన తీరుపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలంటూ కౌంటరిచ్చారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ (Telangana) ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదనే విషయం మరువొద్దంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాని చెప్పారు.
రేవంత్‌లో ఎంతో మార్పు రావాల్సి ఉండే
తాజాగా శుక్రవారం ఓ టీవీ ఛానల్‌తో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. పండబెట్టి తొక్కుతా అనే భాష మీద నేను మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలు నిజాయితీగా పరిపాలించాలని, రాష్ట్రం బాగుంటే మా బతుకులు బాగుంటయని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. అందరం కష్టపడితే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మూడేండ్ల మార్పు రావాల్సి ఉండే ఇప్పిటికే. ఆయన ఆలోచన విధానం, మాట్లాడే విధానం, అనుసరించే విధానం, పని చేసే విధానంలో ఎంతో మార్పు రావాల్సి ఉండే. అహంకారాన్ని వీడాలి.
ప్రజలకు మేలు చేయాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా..
మాలలో ఉన్నా.. ఎవరినీ విమర్శించి, రాజకీయం చేయదల్సుకోలే. రేవంత్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మవంచన చేసుకొని పరిపాలన చేయొద్దు. పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు మేలు చేయాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా. నాగురించి ముఖ్యమంత్రి మాట్లాడినంత మాత్రాన ఎవరు ఏందో తెల్సు ప్రజలకు. కేవలం పేద ప్రజలకు న్యాయం చేయడం కోసమే నేను ప్రజల్లో ఉన్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల శ్రేయస్సు ఆలోచించే చేస్తా. రాజగోపాల్ రెడ్డి ప్రాణం పోయినా తప్పు చేయడు.
ఎవరికి కుక్క కిరిచిందో ప్రజలకు అర్థమైతుంది
ముఖ్యమంత్రి భాష ప్రజలందరికి అర్థమైతుంది. ఎవరికి కుక్క కరిచిందనేది కూడా ప్రజలకు అర్థమైతది. నేను తప్పుడుగా మాట్లాడదల్సుకోలే. గత మూడేండ్ల నుంచి ఎవరు ఏం మాట్లాడుతున్నరో ప్రజలు చూస్తున్నరు. అహంకారంగా, ఆవేశపూరితంగా, అధర్మంగా, అవినీతిమయంగా ఎవరు పరిపాలన చేస్తున్నరో తెలంగాణ ప్రజలందరు చూస్తున్నరు. సమయం వచ్చినప్పుడు తీర్పు వాళ్లే ఇస్తరు. అవతలి వ్యక్తి మాట్లాడుతుండు కదా అని చెప్పేసి.. అజ్ఞానంతోటి విచక్షణ కోల్పోయి, కండ్లు నెత్తికెక్కినట్లు నేను మాట్లాడదల్సుకోలే. అటువంటోనికి బుద్ధి ప్రసాదించమని దేవున్ని కోరుకుంటున్నా.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. RTV Exclusive!
--> స్వామి అదృష్టం కలిసి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు
--> అందరం కష్టపడితేనే సీఎం కుర్చీలో కూర్చున్నారు
--> సీఎంగా మూడేళ్లలో రేవంత్ రెడ్డిలో మార్పు రావాల్సి ఉంది.. కానీ రాలేదు
--> ఆయన మాట్లాడుతున్న మాటలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
--> ఆత్మవంచన చేసుకోవద్దు.. అహంకారాన్ని వీడాలి
--> పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు మేలు చేయాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా
--> రాజగోపాల్ రెడ్డి ప్రాణం పోయినా తప్పు చేయడు
Watch Full Video Here:https://t.co/RBr5xj9g60
#KomatireddyRajagopalReddy #RevanthReddy #TelanganaPolitics #Congress #Telangana #RTV— RTV (@RTVnewsnetwork) November 20, 2026
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..






