CM Vijay | చాలా ప్రత్యేకం.. సీఎం విజయ్‌తో ఎయిర్ హోస్టెస్ ఫొటో వైరల్
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (CM Vijay)తో ఎయిర్ హోస్టెస్ (air hostess) దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా (Tamil Nadu CM) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ (CM Vijay) క్రేజ్ అమాంతం పెరిగింది. ఆయన కనిపిస్తే చాలు ఫొటోలు తీసుకునేందుకు ఇప్పుడు జనాలు ఎగబడుతున్నారు. తాజాగా సీఎం జోసెఫ్ విజయ్‌తో ఎయిర్ హోస్టెస్ (air hostess) దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశమయ్యాయి. ఢిల్లీ పర్యటన ముగించుకొని తమిళనాడు వెళ్తుండగా.. ఫ్లైట్‌లో ఉమా మీనాక్షి అనే ఎయిర్ హోస్టెస్ సీఎంతో ఫొటో దిగింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేసింది. "గౌరవనీయ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (అందరూ ప్రేమగా పిలుచుకునే దళపతి) గారితో ప్రయాణించడంతో ఈరోజు నా విధి నిర్వహణ మరింత ప్రత్యేకంగా మారింది" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ ఫొటో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సీఎం విజయ్‌తో ఫొటో దిగే అవకాశం మాకెప్పుడొస్తుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విజయ్‌ను కలిసే అవకాశం మీనాక్షికి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
Also Read..
ఎల్ఈడీ బల్బును మింగేసిన చిన్నారి.. ఎలా బయటకు తీశారంటే..?
సంబంధిత వార్తలు

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
సెప్టెంబర్ 10, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్



