LED Bulb | ఎల్ఈడీ బల్బును మింగేసిన చిన్నారి.. ఎలా బయటకు తీశారంటే..?
LED Bulb | తొమ్మిది నెలల చిన్నారి ఆడుకుంటూ నేలపై పడి ఉన్న ఓ చిన్న ఎల్ఈడీ బల్బు (LED Bulb)ను మింగేసింది. ఆ బల్బు చిన్నారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది.
LED Bulb | తొమ్మిది నెలల చిన్నారి ఆడుకుంటూ నేలపై పడి ఉన్న ఓ చిన్న ఎల్ఈడీ బల్బు (LED Bulb)ను మింగేసింది. ఆ బల్బు చిన్నారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక చిన్నారి అల్లాడిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలో (Pune) చోటు చేసుకుంది. అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిస్ సైన్స్ (Army Institute of Cardio-Thoracic Sciences)కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ వైద్యులు (Indian Army Doctors) బ్రోంకోస్కోపీ ద్వారా చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బును గుర్తించి దాన్ని విజయవంతంగా తొలగించారు.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను సదరన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అత్యంత సంక్లిష్టమైన బ్రోంకోస్కోపిక్ ప్రక్రియ ద్వారా చిన్నారి ప్రాణాలను కాపాడినట్లు తెలిపింది. ఎలాంటి మేజర్ ఆపరేషన్ లేకుండానే చిన్నారిని బతికించినట్లు వివరించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Specialists at Army Institute of Cardio-Thoracic Sciences (#AICTS), Pune successfully saved the life of a 9-month-old infant after removing a hazardous LED bulb with corrosive wires lodged deep inside the airway of the left lung through a highly complex bronchoscopic procedure.… pic.twitter.com/iraVg0kJmc
— Southern Command INDIAN ARMY (@IaSouthern) May 28, 2026
Also Read..
తుఫాను ధాటికి కూలిన బ్రిడ్జి.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
ఆగస్టు 24, 2026

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
ఆగస్టు 22, 2026

Super Glue | అమానుషం.. 9 నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోసిన మేనత్త
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్



