Heatwaves | నేడు ఈ జిల్లాల్లో వడగాలులు.. జర జాగ్రత్త
Heatwaves | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం కాస్త చల్లబడిన వాతావరణం.. సూర్యుడి ప్రతాపంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
Heatwaves | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం కాస్త చల్లబడిన వాతావరణం.. సూర్యుడి ప్రతాపంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు (Heatwaves) వీస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో, శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈ రెండు రోజుల్లో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడి వర్షం కురిసింది. మరో రెండు గంటల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం కురువనుంది.
ఇక ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. భద్రాచలంలో 44.2, రామగుండంలో 44, నిజామాబాద్‌లో 43.6, హనుమకొండలో 43, ఖమ్మంలో 45, మెదక్ 41.5 డిగ్రీలు, హకీంపేటలో 40.2, దుండిగల్‌లో 39 డిగ్రీలు రికార్డవుతుందని వెల్లడించింది.
12 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే..
గురువారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో 46.4 డిగ్రీలు రికార్డయింది. ఇక వరంగల్ జిల్లా సంగెం 46.3, పెద్దపల్లి జిల్లా ముత్తారం 46.3, భూపాలపల్లి జిల్లా కాటారం 46.2, ఖమ్మం జిల్లా ఏన్కూరు 46.2, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు 46.2, నిజామాబాద్ జిల్లా బోధన్ 46.2, మహబూబాబాద్ జిల్లా గార్ల 46.1, సూర్యాపేట జిల్లా నాగారం 46.1, కొత్తగూడెం జిల్లా పాల్వంచ 46.1, జగిత్యాల జిల్లా యెండపల్లి 46.1, నిర్మల్ జిల్లా కేంద్రంలో (నిర్మల్ గ్రామీణ మండలం) 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
తాజావార్తలు
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం

Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం





