TVK MLA | విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర..
TVK MLA | తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్ర సంచలనం రేపుతోంది. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ కుట్ర వెనుక డీఎంకే కీలక నేత సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు తెలిసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే కుట్రలు పన్నుతోందని మంత్రి నిర్మల్ కుమార్ (Nirmal Kumar) ఆరోపించారు.
- టీవీకే ఎమ్మెల్యేకి రూ.35 కోట్లు ఆఫర్
- ముగ్గురు డీఎంకే కార్యకర్తలు అరెస్ట్
- తెరపైకి డీఎంకే కీలక నేత సెంథిల్ బాలాజీ పేరు
- టీవీకే ఎమ్మెల్యేలను స్టాలిన్ ప్రలోభపెడుతున్నారు : మంత్రి నిర్మల్ కుమార్
TVK MLA | తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ (CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రకు సంబంధించి పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాసనసభ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంలో తనకు అనుకూలంగా ఓటు వేయాలని, అందుకు బదులుగా రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని ఆశ చూపారని అధికార టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా (N Ilaiyaraja) చెన్నై పోలీసు కమిషనర్‌కు గత నెల 29న ఫిర్యాదు చేశారు. తిరునావుక్కరసు అనే వ్యక్తి 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (IPDS) సంస్థకు తాను అధిపతినని చెప్పుకుంటూ తనను సంప్రదించినట్లు సదరు ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ సభ్యుల తరపున తాను మాట్లాడుతున్నట్లు తెలిపాడన్నారు.
అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని, మళ్లీ తనకు ఫోన్ చేయవద్దని హెచ్చరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినప్పటికీ, తిరునావుక్కరసు తనను పదేపదే బెదిరించాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరునావుక్కరసును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తెరపైకి సెంథిల్ బాలాజీ పేరు..
ఈ కుట్రలో డీఎంకే మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు వి.అశోక్ కుమార్‌కు కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్‌ల ఆదేశాల మేరకే తిరునావుక్కరసు.. ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించినట్లు ఆరోపించారు.
విచారణ సమయంలో కరూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు టీవీకే ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపారని తిరునావుక్కరసు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చెన్నై పోలీసులు కరూర్‌కు చేరుకుని కార్తీక్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ డీఎంకే కార్యకర్తలని, సెంథిల్ బాలాజీకి సన్నిహితులుగా తెలుస్తోంది. కార్తీక్ డీఎంకే క్రీడా విభాగానికి డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
మా ప్రభుత్వంపై డీఎంకే కుట్రలు : మంత్రి పి. నిర్మల్ కుమార్
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే కుట్రలు పన్నుతోందని మంత్రి నిర్మల్ కుమార్ (Nirmal Kumar) ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను స్టాలిన్ ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు డీఎంకే గత 40 రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. "డీఎంకే, స్టాలిన్ బృందం మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకునేందుకు గత 40 రోజులుగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం టీవీకే ఎమ్మెల్యేల్లో ఒకరిని డీఎంకే సభ్యులు బెదిరించారు.
దీని వెనుక సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్ ఉన్నారు. వారి మద్దతుతో మా ఎమ్మెల్యే ఒకరికి దాదాపు రూ.35 కోట్లు ఆఫర్ చేశారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చినప్పుడు టీవీకేకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారు కోరారు. దానికి మా ఎమ్మెల్యే నిరాకరించడంతో డీఎంకే నేతలు ఎమ్మెల్యేని తీవ్రంగా బెదిరించారు. అన్ని ఆధారాలతో మా ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురూ సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులు" అని మంత్రి నిర్మల్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Also Read..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పైసల్లేవ్ గానీ.. లక్ష కోట్లతో మూసీ బాగు చేస్తావా?
సంబంధిత వార్తలు

TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
ఆగస్టు 22, 2026

CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు
ఆగస్టు 19, 2026

CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..



