Prateek Yadav | ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి.. భార్యతో విభేదాలే కారణమా..?
Prateek Yadav | సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రతీక్ యాదవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక పరిశీలనలో ఆయన శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించలేదని వైద్యులు పేర్కొన్నారు.
Prateek Yadav | సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (Prateek Yadav) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో ప్రతీక్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆ సమయంలో ప్రతీక్ భార్య, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ (Aparna Yadav) ఇంట్లో లేరని తెలిసింది. భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.
ప్రతీక్ యాదవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక పరిశీలనలో ఆయన శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించలేదని వైద్యులు పేర్కొన్నారు. ఆయన మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించనుంది. అయితే, ప్రతీక్ యాదవ్ గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో (lung-related issues) బాధపడుతున్నారు. దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నాడు.
ప్రతీక్.. మూలాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన కుమారుడు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)కు సోదరుడు (సవతి తల్లి కుమారుడు). బ్రిటన్‌లోని లీడ్స్ వర్సిటీలో ప్రతీక్ ఎంబీఏ పూర్తి చేశారు. రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్ రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
2011లో ప్రతీక్‌కు అపర్ణతో వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అపర్ణ వల్ల తన కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ప్రతీక్ గతంలో ఆరోపించాడు. ఆమె తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందంటూ మండిపడ్డారు. ఆమెతో విడాకులు తీసుకోనున్నట్లు జనవరిలో ప్రతీక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ప్రతీక్ మరణంతో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read..
మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం: డీజీ చారుసిన్హా
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. రికవర్ అవుతున్నాయా..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జూన్ 18, 2026

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
జూన్ 17, 2026

Akhilesh Yadav | బెంగాల్, తమిళనాడులో పరాజయాల ఎఫెక్ట్: ఐ-ప్యాక్‌కు అఖిలేష్ గుడ్‌బై.. పీకే టీమ్‌ను పక్కనపెట్టిన సమాజ్ వాదీ పార్టీ
మే 6, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



