Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
Karur Stampede Case | కరూర్ తొక్కిసలాట ఘటనకు చెందిన కేసులో డీఎంకే దాకలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అత్యవసర విచారణ కోరుతూ డీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.r
Karur Stampede Case | కరూర్ తొక్కిసలాట ఘటనకు చెందిన కేసులో డీఎంకే దాకలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అత్యవసర విచారణ కోరుతూ డీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ మేరకు మంగళవారం విచారణకు జాబితాలో చేర్చింది. పిటిషన్‌లో తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జునపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు తొక్కిసలాట ఘటనపై టీవీకే మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డీఎంకే కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 142 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మంత్రి ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని డీఎంకే పిటిషన్‌లో పేర్కొంది. జులై 2న జరిగిన సభలో మాట్లాడుతూ.. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ గత డీఎంకే ప్రభుత్వాన్నే కరూర్ విషాదానికి బాధ్యతలుగా ఆరోపించారంటూ డీఎంకే నేత పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తి, అదీ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, సీబీఐ విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని డీఎంకే వాదిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే నాయకత్వంపై ప్రజలను తప్పుదారి పట్టించే అభిప్రాయం కల్పించడమే మంత్రి వ్యాఖ్యల ఉద్దేశమని ఆరోపించింది.
సీఎం విజయ్ కరూర్‌కు వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కారుణ్య నియామక ప్రతాలు అందజేయనున్నట్లుగా వస్తున్న వార్తలను సైతం పిటిషన్‌లో ప్రస్తావించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన డీఎంకే.. సీబీఐ దర్యాప్తులో ఆ కుటుంబ సభ్యులే కీలక సాక్షులని, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు వారిని నేరుగా కలవడం దర్యాప్తు స్వతంత్రతపై సందేహాలకు తావిస్తోంది పేర్కొంది. కరూర్ తొక్కిసలాట కేసు విచారణలో లోపాలు ఉన్నాయని, మద్రాస్ హైకోర్టులో కేసు నిర్వహణపై సైతం సందేహాలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. గతంలో ఈ కేసు దర్యాప్తును మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా

Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో




