DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
DMK MLA | ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay), నటి త్రిషల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే (DMK MLA) అనితా రాధాకృష్ణన్‌ను (Anitha R Radhakrishnan) పోలీసులు అరెస్ట్ చేశారు.
DMK MLA | ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యే (DMK MLA) అనితా రాధాకృష్ణన్‌ను (Anitha R Radhakrishnan) పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కాసేపటికే అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 20న మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా తిరుచెందూర్ (Tiruchendur) సమీపంలోని అత్తూరు (Athur)లో జరిగిన బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ.. సీఎం విజయ్, నటి త్రిషల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విజయ్ చిత్రపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి, అసెంబ్లీలో సీఎం విజయ్ హావభావాలను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. "నేను ఇలా ఇరుక్కుపోయానేంటి..? ఒక నటితో (త్రిషను ఉద్దేశిస్తూ) ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయానే" అన్న ఆందోళనలో విజయ్ ఉన్నారంటూ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవర్తనను ఒక దుకాణంలోకి ప్రవేశించే కస్టమర్‌తో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. "నేనొక వ్యాపారిని.. ఒక వ్యక్తి నా షాపులోకి వస్తే అతను ఏదైనా కొనడానికి వచ్చాడా..? లేక అప్పు కోసం వచ్చాడా..? అన్నది వారి ముఖం చూసి చెప్పగలను. అలానే, అసెంబ్లీలో సీఎం ఎంతలా ఇరుక్కుపోయినట్లు ఫీల్ అయ్యారో నేను గ్రహించగలను" అంటూ వ్యాఖ్యానించారు. డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
Also Read..
డివైడర్‌ను ఢీకొట్టిన ఎల్‌పీజీ ట్యాంకర్.. గ్యాస్ లీకై భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. షాకింగ్ వీడియో
మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు
అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ - ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు
సంబంధిత వార్తలు

CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
ఆగస్టు 24, 2026

CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు
ఆగస్టు 19, 2026

CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో
- ●Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
- ●ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ
- ●Ponguleti | ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి
- ●MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట
- ●Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ - జానీ మాస్టర్‌తో కలిసి!

Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో

Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ

Ponguleti | ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి



