CM Vijay | రాహుల్‌తో లంచ్.. మోదీతో మెట్రో రైడ్.. సీఎం విజయ్ తగ్గేదేలేదు
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (CM Vijay) పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
CM Vijay | త్రినేత్ర న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (CM Vijay) పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో తన ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధన కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా పరిణామాలు.

రాహుల్‌తో లంచ్, టీ భేటీ

ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలిశారు. తన నీలంకరై నివాసంలో రాహుల్‌తో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు. ఇటీవలే జరిగిన ధారాపురం (Dharapuram), మధురాంతకం (Madurantakam) ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందుకు గానూ విజయ్‌కు రాహుల్ అభినందనలు తెలిపారు. ఇరువురు నేతలూ పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కాసేపు సరదాగా కేఫ్‌కు వెళ్లారు. అక్కడ స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్‌ను చూసిన స్థానికులు వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. టీ మీటింగ్ తర్వాత రాహుల్ నగరంలోని తాను బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. ఇవాళ సాయంత్రం ఐలాండ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఛాత్రోన్ కీ గూంజ్ (Chhatron Ki Goonj) కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రధాని చెన్నై పర్యటన

ఇదిలా ఉండగా రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చెన్నైకి రానున్నారు. ఈ సందర్భంగా రూ. 13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రధానితో సీఎం విజయ్ వేదిక పంచుకోనున్నారు. చెన్నై మెట్రో ఫేజ్-2లో భాగంగా పూందమల్లి - వడపళని మార్గాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. పోరూరు బైపాస్ నుంచి పూందమల్లి బైపాస్ వరకు ప్రధానితో కలిసి విజయ్ మెట్రో రైడ్‌కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో సీఎం విజయ్ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలా వారాంతంలో అటు అధికార పక్షం, ఇటు విపక్షపార్టీ నేతలతో సీఎం వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.
Also Read..
శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువకుడు మృతి
- ●Dhurandhar 2 | గ్రామీ అవార్డుల రేసులో ధురంధర్ 2 - తొమ్మిది విభాగాల్లో పోటీ
- ●Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
- ●GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
- ●MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్
- ●6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..

Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువకుడు మృతి

Dhurandhar 2 | గ్రామీ అవార్డుల రేసులో ధురంధర్ 2 - తొమ్మిది విభాగాల్లో పోటీ

Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!

GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..






