MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్
MDMA Drugs | రాష్ట్రంలో డ్రగ్స్( Drugs )పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ.. ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా( Rangareddy ) షాబాద్‌లో ఎండీఎంఏ డ్రగ్స్( MDMA Drugs ) పట్టుబడింది.
MDMA Drugs | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో డ్రగ్స్( Drugs )పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ.. ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా( Rangareddy ) షాబాద్‌లో ఎండీఎంఏ డ్రగ్స్( MDMA Drugs ) పట్టుబడింది. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ ఇద్దరు యువకులు.. నాగరగూడ టీ పాయింట్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఇద్దరి నుంచి 13.97 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి మోకిలా, కోకాపేట తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఇతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులిద్దరిని శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన మారం వంశీ రెడ్డి (23), వీర ప్రవీణ్ కుమార్ (28) గా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు.
తాజావార్తలు
- ●Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
- ●GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
- ●6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
- ●KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం
- ●Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!
- ●KTR | గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోండి : కేటీఆర్

Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!

GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..

6G Network | భారత్‌లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..

KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం





