త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 ల‌క్ష‌లు అగ్నికి ఆహుతి

Nirmal | రెక్క‌లు ముక్క‌లు చేసుకుని క‌ష్ట‌ప‌డి రూపాయికి రూపాయి కూడ‌బెట్టుకున్నాడు. ఆ పోగెసుకున్న డ‌బ్బుతో బిడ్డ పెళ్లి చేయాల‌నుకున్నాడు. కానీ ఆ కూడ‌బెట్టిన డ‌బ్బంతా అగ్నికి ఆహుతి అయింది.

S

Telangana | Published On Nov 25, 2026, 12.55 pm IST

Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 ల‌క్ష‌లు అగ్నికి ఆహుతి
Advertisement

Nirmal | త్రినేత్ర న్యూస్ : రెక్క‌లు ముక్క‌లు చేసుకుని క‌ష్ట‌ప‌డి రూపాయికి రూపాయి కూడ‌బెట్టుకున్నాడు. ఆ పోగెసుకున్న డ‌బ్బుతో బిడ్డ పెళ్లి చేయాల‌నుకున్నాడు. కానీ ఆ కూడ‌బెట్టిన డ‌బ్బంతా అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది.

బాస‌ర ర‌వీంద్ర‌పూర్ కాల‌నీకి చెందిన షేక్ ఇబ్ర‌హీం ఇంట్లో బుధ‌వారం ఉద‌యం ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. మంట‌లు క్ష‌ణాల్లోనే ఇళ్లంతా వ్యాపించాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో త‌న బిడ్డ పెళ్లి కోసం దాచిన రూ. 10 ల‌క్ష‌లు, 4 తులాల బంగారం అగ్నికి ఆహుతి అయింద‌ని కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.

పెళ్లి కోసం తెచ్చిన ఫర్నిచర్‌, విలువైన వస్త్రాలు కూడా దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.బాసర సీఐ దీపక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

Advertisement
Advertisement