త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొల‌గించారు : సోనియా గాంధీ

Sonia Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్యకు మార్గం సుగమం చేసేందుకే ఆయ‌న భ‌ద్ర‌త‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా తొల‌గించార‌ని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆరోపించారు.

D

National | Published On Nov 24, 2026, 2.11 pm IST

Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొల‌గించారు : సోనియా గాంధీ
Advertisement

Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్యకు మార్గం సుగమం చేసేందుకే ఆయ‌న భ‌ద్ర‌త‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా తొల‌గించార‌ని ఆరోపించారు. త‌న ఆత్మ‌క‌థ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకం గురించి తన కుమారుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), కుమార్తె ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లతో జ‌రిగిన ప్ర‌త్యేక సంభాష‌ణ‌లో ఆమె ఈ మేర‌కు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో రాజీవ్ గాంధీ అనేక రాష్ట్రాల్లో ప‌ర్య‌టించేవార‌ని సోనియా తెలిపారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్లో నిరసనలు, రాళ్లదాడులు జరిగేవని చెప్పారు. ముఖ్యంగా బీహార్ ప‌ర్య‌ట‌న ఒక కీల‌క మ‌లుపు అని అన్నారు. కొంద‌రు కుట్ర‌పూరితంగానే రాజీవ్‌పై దాడుల‌కు పాల్ప‌డేవార‌ని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ భ‌ద్ర‌త‌పై తాను తీవ్ర ఆందోళన చెందాన‌ని సోనియా గుర్తు చేసుకున్నారు. అలాంటి ఘటనలను ప్రత్యక్షంగా చూసిన రాహుల్ గాంధీ కూడా తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని భయపడ్డారని ఆమె పేర్కొన్నారు.

నాన్న భద్రత కోసం మనం ఏమీ చేయకపోతే.. ఆయన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని రాహుల్ ఆందోళ‌న చెందిన‌ట్లు చెప్పుకొచ్చారు. అంత జరిగినా అప్పటి ప్రభుత్వం రాజీవ్‌కు సెక్యూరిటీ పెంచలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజీవ్ భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డం వెనుక క‌చ్చితంగా కుట్ర‌పూరిత ఉద్దేశం ఉంద‌ని ఆమె ఆరోపించారు. త‌ల్లి వ్యాఖ్య‌ల‌తో రాహుల్ గాంధీ కూడా ఏకీభ‌వించారు. త‌న తండ్రిని హ‌త్య చేసేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న భ‌ద్ర‌త‌ను తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత ఆరోపించారు.

Also Read..

మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజ‌య్ ప్ర‌భుత్వంపై మ‌ద్రాసు హైకోర్టు ఆగ్ర‌హం

ఆత్మ‌క‌థ‌లో సావ‌ర్క‌ర్‌పై వ్యాఖ్య‌లు.. సోనియా గాంధీకి లీగ‌ల్ నోటీసులు

కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్‌ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!

Advertisement
Advertisement