Ponnam Prabhakar | రేపు సంవిధాన్ రక్షా మార్చ్.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యంగ పరిరక్షణ ర్యాలీ (Samvidhan Raksha March)కు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం (నవంబర్ 26న) నిర్వహించనున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యంగ పరిరక్షణ ర్యాలీ (Samvidhan Raksha March)కు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం (నవంబర్ 26న) నిర్వహించనున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల హక్కులను కాపాడుకునే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వాములై రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy Musi Riverfront Review | మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. ప్రాజెక్టుల డెడ్లైన్లు ఇవే!
నవంబర్ 24, 2026

Hyderabad Bomb Threat Email | హైదరాబాద్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు
నవంబర్ 24, 2026

Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●NSE Shares | ఎన్ఎస్ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..
- ●Dalai Lama | దలైలామాకు ఢిల్లీలో అధికారిక బంగ్లా కేటాయింపు
- ●Horoscope | నవంబర్ 25 రాశిఫలాలు.. కొత్త ఒప్పందాలకు అనుకూలమైన సమయం!
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. 1,000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..
- ●Mahesh Babu Instagram Comment | మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్నైట్ స్టార్ అయిన చిన్నారి!

NSE Shares | ఎన్ఎస్ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..

Dalai Lama | దలైలామాకు ఢిల్లీలో అధికారిక బంగ్లా కేటాయింపు

Horoscope | నవంబర్ 25 రాశిఫలాలు.. కొత్త ఒప్పందాలకు అనుకూలమైన సమయం!

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..



