త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE Shares | ఎన్‌ఎస్‌ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..

NSE Shares | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సానుకూల అంచనాలను వెల్లడించింది. ఈ షేర్లకు బై రేటింగ్ ఇస్తూ రూ.2,650 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే సుమారు 20 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల విస్తరణ, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ ఆధిపత్యం, బలమైన ఆదాయ వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

S

Business | Published On Nov 25, 2026, 12.03 pm IST

NSE Shares | ఎన్‌ఎస్‌ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..
Advertisement

NSE Shares | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సానుకూల అంచనాలను వెల్లడించింది. ఈ షేర్లకు బై రేటింగ్ ఇస్తూ రూ.2,650 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే సుమారు 20 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల విస్తరణ, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ ఆధిపత్యం, బలమైన ఆదాయ వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

ఇన్వెస్ట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న షేర్లు..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు బుధవారం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ షేర్లపై తొలిసారిగా విశ్లేషణ ప్రారంభిస్తూ బై రేటింగ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.2,650 టార్గెట్ ప్రైస్‌ను నిర్దేశించింది. సోమవారం ముగింపు ధరతో పోలిస్తే ఇది సుమారు 20 శాతం అప్‌సైడ్‌ను సూచిస్తోంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్ అభిప్రాయపడింది. క్యాష్ ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్లలో ఎన్‌ఎస్‌ఈ ఆధిపత్యం సంస్థకు ప్రధాన బలంగా నిలుస్తోందని పేర్కొంది.

భారీగా పెరుగుతున్న ఆదాయం..

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం.. ఎన్‌ఎస్‌ఈ భారీ కార్యకలాపాల స్థాయి, అధునాతన టెక్నాలజీ మౌలిక సదుపాయాలు, అధిక లిక్విడిటీ ఇతర సంస్థలకు గట్టి పోటీగా మారుతున్నాయి. ఇవి కొత్త సంస్థలు మార్కెట్లోకి ప్రవేశించడానికి అడ్డంకులుగా నిలుస్తూ ఎన్‌ఎస్‌ఈ లాభదాయకతను కాపాడుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్యాష్ ఈక్విటీ ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ వాటా 11.4 శాతం ఉండగా, ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ట్రేడింగ్‌లో 51.2 శాతంగా నమోదైంది. 2026-27 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య సంస్థ ఆదాయం సగటున 15 శాతం, పన్నుల అనంతర లాభం (పీఏటీ) 17 శాతం చొప్పున వార్షిక వృద్ధి సాధిస్తుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. ఎబిట్డా మార్జిన్లు 78 శాతానికి చేరుతాయ‌ని పేర్కొంది.

షేర్ టార్గెట్ ధ‌ర వివ‌రాలు..

2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ఎన్‌ఎస్‌ఈ పీఏటీ రూ.16,400 కోట్లకు చేరుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఒక్కో షేరుకు రూ.66.3 అంచనా ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని 40 రెట్ల పీఈ నిష్పత్తితో రూ.2,650 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రధాన ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలతోపాటు కమోడిటీస్ ట్రేడింగ్, గిఫ్ట్ సిటీ కార్యకలాపాలు, భారత క్యాపిటల్ మార్కెట్ల విస్తరణ భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని అందించే అవకాశాలున్నాయని తెలిపింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ ఆధిపత్యం, సాంకేతిక సామర్థ్యం, కొత్త వ్యాపార అవకాశాలు దీర్ఘకాలిక ఆదాయ వృద్ధికి దోహదపడతాయని బ్రోకరేజ్ విశ్వసిస్తోంది.

Advertisement
Advertisement