Laxmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ..
Lakshmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బిడ్డలు సిద్ధమయ్యారు. విక్టోరియా రాష్ట్రం లావర్టన్ నియోజకవర్గం నుంచి కామారెడ్డి కామారెడ్డి జిల్లాకు చెందిన చిట్టెడి సుచిత్ర (Chittedi Suchitra) ఎన్నికల బరిలో నిలువగా.. హైదరాబాద్ (Hyderabad) మూలాలున్న లక్ష్మీ లంకెల కెందెర్ల (Lakshmi Lankala Kenderla) సిడెన్‌హామ్ (Sydenham) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Lakshmi Lankala Kenderla | త్రినేత్ర న్యూస్: ఆస్ట్రేలియా ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బిడ్డలు సిద్ధమయ్యారు. విక్టోరియా రాష్ట్రం లావర్టన్ నియోజకవర్గం నుంచి కామారెడ్డి కామారెడ్డి జిల్లాకు చెందిన చిట్టెడి సుచిత్ర (Chittedi Suchitra) ఎన్నికల బరిలో నిలువగా.. హైదరాబాద్ (Hyderabad) మూలాలున్న లక్ష్మీ లంకెల కెందెర్ల (Lakshmi Lankala Kenderla) సిడెన్‌హామ్ (Sydenham) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇరువురూ ది రిపబ్లికన్ (The Republican) పార్టీ అభ్యర్థులే కావడం గమనార్హం. ఈ నెల 28న పోలింగ్ జరుగనుంది.
నారాయణగూడ నుంచి ఆస్ట్రేలియా రాజకీయాల వరకు..
లక్ష్మీ లంకల కెందెర్ల హైదరాబాద్ మూలాలున్న భారతీయ ఆస్ట్రేలియన్ రాజకీయ నాయకురాలు. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె.. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో పాఠశాల, కాలేజీ విద్య పూర్తి చేశారు. ఢిల్లీలో ఎంబీబీఎస్ చదివారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. కర్ణాటకకు చెందిన మల్లేశ్‌ను వివాహం చేసుకున్న తర్వాత తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె తల్లి ఎల్‌కే జయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తున్నారు.
వివిధ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ఆమె.. తాగాజా విక్టోరియా ఎన్నికల (Victorian Legislative Assembly) రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ రాష్ట్ర పార్లమెంటు దిగవ సభ అయిన విక్టోరియన్ లెజిస్టేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచారు. విక్టోరియన్ ఎలక్టోరల్ కమిషన్ సిడెన్‌హామ్ (Sydenham District)) అభ్యర్థిగా ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది పోటీచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి రాష్ట్ర ఎన్నికల్లో పోటీచేస్తుండటంతో తెలంగాణ మూలాలున్న వారితోపాటు ప్రవాస భారతీయులలో ఆమె అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి నెలకొంది.
ఆరోగ్య సంరక్షణే ప్రధాన అంశంగా..
కమ్యూనిటీ భద్రత, మెరుగైన రహదారులు, ప్రజా రవాణా సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణే ప్రధాన అంశాలుగా లక్ష్మి తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతను మెరుగుపరచడానికి పటిష్టమైన పోలీసింగ్, నేర నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మెరుగైన రహదారులు, సురక్షితమైన కూడళ్లు, నమ్మకమైన ప్రజా రవాణా సేవలు తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, అందుబాటులో ఉండే వైద్య సేవల కోసం కృషిచేస్తానని ప్రచారం చేస్తున్నారు. నిత్యావసర ఖర్చులు తగ్గించడంతోపాటు కుటుంబాలకు బడ్జెట్ ఉపశమనం కలిగించడం, చిన్న వ్యాపారాలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు.

కామారెడ్డి ఆడబిడ్డ..
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన చిట్టెడి సుచిత్ర (Chittedi Suchitra) ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో నిలిచారు. ది రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో విక్టోరియా రాష్ట్రం లావర్టన్ (Laverton) నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన చిట్టెడి వినోద, గంగారెడ్డి దంపతుల కుమార్తె చిట్టెడి సుచిత్ర.. ఉన్నతవిద్య అభ్యసించడానికి 2014లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. అంతంపల్లి గ్రామానికే చెందిన భర్త రాకేశ్ రెడ్డి సహకారంతో ఇద్దరూ అక్కడే స్థిరపడ్డారు.
ఈ ఎన్నికల్లో లావర్టన్ నియోజకవర్గం నుంచి చిట్టెడి సుచిత్రతో పాటు మొత్తం 9 మంది బరిలో నిలిచారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సుచిత్ర. తనను గెలిపిస్తే రవాణా సౌకర్యాలతో పాటు నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక వసతులు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు, మెరుగైన ఆరోగ్య సేవలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | రేపు సంవిధాన్ రక్షా మార్చ్.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 25, 2026

Revanth Reddy Musi Riverfront Review | మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. ప్రాజెక్టుల డెడ్లైన్లు ఇవే!
నవంబర్ 24, 2026

Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●MLA KP Vivekananda Goud | కూకట్పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసి కుట్ర
- ●Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
- ●Gold | నెల రోజుల్లో రూ.20వేలు తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు కొనవచ్చా..?
- ●Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి
- ●Anthropic IPO | ఐపీఓ జోరు ఆవిరి.. ఇష్యూ ధర కంటే దిగువకు ఆంథ్రోపిక్ షేర్లు..
- ●Miss Universe 2026 | భారత్‌కు నిరాశ.. విశ్వసుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ప్యూర్టో రికో భామ

MLA KP Vivekananda Goud | కూకట్పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసి కుట్ర

Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

Gold | నెల రోజుల్లో రూ.20వేలు తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు కొనవచ్చా..?

Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి



