AIADMK | ఏఐఏడీఎంకేలో చీలిక.. టీవీకేవైపు 35 మంది ఎమ్మెల్యేల మొగ్గు
AIADMK | ఏఐఏడీఎంకేలో చీలిక మొదలైనట్లు తెలుస్తోంది. సుమారు 35 మంది ఎమ్మెల్యేలు టీవీకేవైపు మొగ్గు చూపినట్లు సమాచారం. టీవీకేతో పొత్తుపై ఆలోచించాలని AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కోరినట్లు తెలుస్తోంది.
AIADMK | తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు విషయంలో ఏఐఏడీఎంకే (AIADMK)లో చీలిక మొదలైనట్లు తెలుస్తోంది. మూడింట రెండొంతుల మందికిపైగా పార్టీ ఎమ్మెల్యేలు టీవీకే వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
సుమారు 35 మంది ఎమ్మెల్యేలు చెన్నైలోని ఏఐఏడీఎంకే నేత సీవీ షణ్ముగం (CV Shanmugam) కార్యాలయానికి చేరుకున్నారు. వారంతా టీవీకేవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. షణ్ముగంతో కలిసి విజయ్‌తో పొత్తుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. టీవీకేతో పొత్తుపై ఆలోచించాలని AIADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కోరినట్లు సమాచారం. కాగా, తాజా ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 47 చోట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. విజయ్‌కి ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇప్పుడు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కూడా విజయ్ టీవీకేవైపు మొగ్గు చూపుతుండటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం ఆ పార్టీకి మరింత సులభతరం కానుంది.
Also Read..
విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. కండిషన్స్ అప్లై..!
శాంతి ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్.. పాజిటివ్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు..
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



