TVK Vijay | విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు.. కండిషన్స్ అప్లై..!
TVK Vijay | తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై నేడు హస్తం పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో టీవీకేకి కాంగ్రెస్ పార్టీ ఓ షరతు విధించింది కూడా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్డీయే, ఏఐఏడీఎంకే సహా దాని మిత్రపక్షాలతో జతకట్టకూడదని స్పష్టంగా తెలిపినట్లు సమాచారం.
TVK Vijay | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజా ఎన్నికల్లో స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 108 స్థానాల్లో జయభేరి మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. దీంతో విజయ్ ఎవరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆయన.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును అధికారికంగా కోరారు. దీంతో విజయ్‌కు హస్తం పార్టీ మద్దతు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో తమిళగ వెట్రి కళగంకి మద్దతు ఇవ్వాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు ఆ పార్టీ ఎంపీ శశికాంత్ సెంథిల్ తాజాగా వెల్లడించారు.
నిర్ణయం మీదే..
టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మొగ్గు చూపగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాత్రం ఈ నిర్ణయాన్ని ఢిల్లీ నాయకులకు బదులుగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీయే తీసుకోవాలని సూచించారట. దీంతో మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ వర్చువల్ సమావేశంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అధికారాన్ని తమిళనాడు విభాగానికి కట్టబెట్టారు. ఇక అధిష్టానం నుంచి పూర్తి సపోర్ట్ రావడంతో తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ.. టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై హస్తంపార్టీ నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రెండు మంత్రి పదువులు..
ఇదే సమయంలో విజయ్ ప్రభుత్వంలో హస్తం పార్టీ రెండు మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు గిరీష్ చోడంకర్, ప్రవీణ్ చక్రవర్తిలు టీవీకే నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
టీవీకేకి ఓ షరతు..
అంతేకాదు, టీవీకేకి హస్తం పార్టీ ఓ షరతు కూడా పెట్టిందట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్డీయే (NDA)తో గానీ, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (AIADMK) సహా దాని మిత్రపక్షాలతో జతకట్టకూడదని స్పష్టంగా తెలిపిందట.
ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి..
తాజా ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. హస్తం పార్టీ మద్దతిస్తే టీవీకే బలం 113కి పెరుగుతుంది. ఇంకా ఐదుగురి మద్దతు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం టీవీకే.. వీసీకే (2), సీపీఎం (2), సీపీఐ (2), ఐయూఎంఎల్ వంటి ఇతర చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ టీవీకే చీఫ్ విజయ్ ఆయా పార్టీలను కోరుతున్నారు.
రేపే సీఎంగా విజయ్ ప్రమాణం..?
మరోవైపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు అంటే మే 7వ తేదీన చెన్నైలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని సమాచారం. ఇందుకోసం విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. నేడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంది.
Also Read..
శాంతి ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్.. పాజిటివ్‌గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు..
ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
కోల్‌కతాలో అర్ధరాత్రి హైడ్రామా.. టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్లు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



