Suvendu Adhikari | బెంగాల్‌లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. తొలి సీఎంగా సువేందు రికార్డు
Suvendu Adhikari | ప్రతిపక్షాల కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బెంగాల్‌కు 9వ సీఎంగా ఆ పార్టీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
Suvendu Adhikari | ప్రతిపక్షాల కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా (Bengal Chief Minister) ఆ పార్టీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో సువేందు చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా సువేందు రికార్డు సృష్టించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. బెంగాల్‌కు 9వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అధికారికి వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు. సీంఎతోపాటూ బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ మంత్రులుగా ప్రమాణం చేశారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో సువేందు మాట్లాడారు. "డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల ప్రాతిపదికన ఏర్పడిన రాజకీయ పార్టీకి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని. అందరికీ చెందినవాడిని. బెంగాల్ ఇప్పటికే చాలా నష్టపోయింది. మా భుజాలపై ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. బెంగాల్‌ను మళ్లీ అద్భుతంగా నిర్మిస్తాం" అని సువేందు అన్నారు.
కాగా, సువేందు అధికారి గతంలో తృణమూల్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉండేవారు. దీదీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కానీ, మమతా బెనర్జీ మేనల్లుడితో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2020లో టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై సువేందు పోటీ చేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో కూడా భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి కూడా దీదీని ఓడించి చరిత్ర సృష్టించారు.
Also Read..
తమిళనాట రాజకీయ గందరగోళం.. వెలుగులోకి ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్.. అందులో ఏముందంటే..?
కరీంనగర్ నిషేధిత ప్రాంతమా? కేటీఆర్ ఎందుకు రావొద్దు: గంగుల
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కోసం పాత లేదా కొత్త విధానం.. ఏది ఉత్తమం..?
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం






