Income Tax Returns | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కోసం పాత లేదా కొత్త విధానం.. ఏది ఉత్తమం..?
Income Tax Returns | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాత పన్ను విధానం (Old Tax Regime) నుంచి కొత్త పన్ను విధానం (New Tax Regime)కి మారాలా, వద్దా అన్న సందేహం చాలా మందికి వస్తుంటుంది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం ఏ విధానాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు.
Income Tax Returns | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాత పన్ను విధానం (Old Tax Regime) నుంచి కొత్త పన్ను విధానం (New Tax Regime)కి మారాలా, వద్దా అన్న సందేహం చాలా మందికి వస్తుంటుంది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం ఏ విధానాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.4 లక్షల వరకు ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల వరకు అందుబాటులో ఉండటంతోపాటు సెక్షన్ 87ఎ కింద రిబేట్ ప్రయోజనాల వల్ల అర్హులైన వ్యక్తులకు రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను శూన్యంగా మారే అవకాశం ఉంది.
కొత్త విధానంలో ఫైలింగ్ సులభతరం..
కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు, తక్కువ కంప్లయెన్స్ ప్రక్రియ ఉండగా, పెట్టుబడి రుజువులు సమర్పించాల్సిన అవసరం తక్కువగా ఉంది. దీంతో పన్ను ఫైలింగ్ ప్రక్రియ సులభతరం అవుతోంది. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), సెక్షన్ 80సి పెట్టుబడులు, హోమ్ లోన్ డిడక్షన్స్ వంటి పెద్ద మొత్తంలో మినహాయింపులు క్లెయిమ్ చేయని వారు కొత్త విధానాన్ని అనుసరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రూ.12.75 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయం ఉన్న ఉద్యోగులు ఈ విధానం వల్ల లాభపడే అవకాశముందని చెబుతున్నారు. అయితే పాత పన్ను విధానం ఇంకా పూర్తిగా ప్రాధాన్యత కోల్పోలేదు. పాత విధానంలో HRA, LTA, సెక్షన్ 80సి, 80డి, హోమ్ లోన్ వడ్డీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, PPF, NPS వంటి పలు డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేసే వారికి పాత విధానం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాత విధానం అయితే..
పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల వరకు వర్తిస్తుంది. అధిక వేతనం పొందుతూ, పెద్ద మొత్తంలో ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు చేసే వ్యక్తులు ముఖ్యంగా హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించే వారు పాత విధానంలో ఎక్కువ పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. సుమారు రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు తమ డిడక్షన్స్‌ను జాగ్రత్తగా లెక్కించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానం సింప్లిసిటీపై దృష్టి పెడితే, పాత విధానం సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రోత్సాహంపై ఆధారపడుతోంది. పాత విధానం క్రమశిక్షణతో సేవింగ్స్ చేసే వారికి ప్రయోజనం కలిగిస్తే, కొత్త విధానం తక్కువ పేపర్‌వర్క్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ తెలిపిన ప్రకారం, కొత్త విధానంలో చాలా డిడక్షన్స్ అందుబాటులో లేవు. HRA మినహాయింపు, సెక్షన్ 80సి, 80డి, హోమ్ లోన్ ప్రయోజనాలు వంటి కీలక మినహాయింపులు కొత్త విధానంలో వర్తించవని స్పష్టం చేసింది. అయితే స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం రెండు విధానాల్లోనూ అందుబాటులో ఉందని తెలిపింది.
ఏది బెటర్..
అయితే ఏ విధానం ఉత్తమం అన్న ప్రశ్నకు నిపుణులు ఒకే సమాధానం చెబుతున్నారు. వ్యక్తిగత ఆదాయం, పెట్టుబడులు, అద్దె భారం, హోమ్ లోన్, ఇన్సూరెన్స్ ఖర్చులు, సేవింగ్స్ అలవాట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. పన్ను విధానం ఎంపికకు ముందు రెండు విధానాల్లో పన్ను లెక్కలు వేసుకుని పోల్చుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్
- ●KTR | రహ్మత్ పాషాను అభినందించిన కేటీఆర్
- ●Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే - బ్లడీ రోమియోతో రొమాన్స్
- ●Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు
- ●OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
- ●Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు

YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్

KTR | రహ్మత్ పాషాను అభినందించిన కేటీఆర్

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే - బ్లడీ రోమియోతో రొమాన్స్

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు






