DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
DK Aruna | విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అసమర్థుడు అని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ( DK Aruna ) పేర్కొన్నారు. ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, ఇంజినీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
DK Aruna | త్రినేత్ర.న్యూస్ : విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అసమర్థుడు అని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ( DK Aruna ) పేర్కొన్నారు. ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, ఇంజినీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం వ్యాఖ్యలపై డీకే అరుణ విరుచుకుపడ్డారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు అంట క్రిమినల్ వేస్ట్ అంట. వాళ్లు పాపం పేద తల్లిదండ్రులు. ఊర్లో కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లు. వాళ్లు ఈ రోజు కష్టపడి నానా తిప్పలు పడి కాలేజీలకు పంపి ఇంజినీరింగ్ చదివిస్తే వాళ్లంత క్రిమినల్ వేస్ట్ అంట. మరి ఈ విద్యా వ్యవస్థకు ఎవరు బాధ్యులు..? ఈ రాష్ట్రంలో విద్యా శాఖ ఎవరి దగ్గర ఉంది..? విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రోజు..? మరి మీరు దీన్ని ఎందుకు మార్చలేకపోయారు. ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతుంది కదా..? ఈ రోజు విద్యార్థులను అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది సమంజసం అనిపిస్తుందా..? మళ్లీ విద్యార్థులు ధర్నాలు చేస్తే వాళ్ల మీద లాఠీచార్జ్ చేయిస్తరు. వాళ్లకు ప్రశ్నించే హక్కు లేదా..? ఈ రోజు మీరు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకుండా, మళ్లీ వారిని అవమానపరిచినట్లు మాట్లాడుతుంటే ఇది ఏ మాత్రం కూడా క్షమించరానటువంటిది. మీరు తప్పకుండా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. విద్యాశాఖ మంత్రిగా మీకు ఆ కుర్చీలో కూర్చొనే అర్హత కూడా లేదు అని డీకే అరుణ తెలిపారు.
అడికి పోయొచ్చి రెండు మాటలు నేర్చుకున్నంత మాత్రాన
అందరికీ మీలాగా హార్వర్డ్ స్కూల్‌కు వెళ్లి వీకెండ్ క్లాస్‌లు అటెండ్ చేయడానికి అవకాశం రాదు. మీరంటే ముఖ్యమంత్రిగా పోయిండ్రు.. అవకాశం వచ్చింది చేశారు. అడికి పోయొచ్చి రెండు మాటలు నేర్చుకున్నంత మాత్రాన మిగతా విద్యార్థులను అవమానించాల్సిన అవసరం లేదు. మీకు చేతనైతే వారికి కూడా అలాంటి అవకాశాలు కల్పించండి. కానీ వారిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారంటే దానికి మీరు బాధ్యులు. మీరు రాజీనామా చేయాలి. మీరు అసమర్థులని నిరూపించుకున్నరు అని డీకే అరుణ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Telangana Coal Mines | తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించండి
ఆగస్టు 11, 2026

Pocharam Srinivas Reddy | అసలు… నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఆగస్టు 11, 2026

CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో



