Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
Dana Kishore | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 13,046 ఫామ్‌పాండ్స్ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
Dana Kishore | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 13,046 ఫామ్‌పాండ్స్ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి డీఆర్డీఓలు, డీపీఓలు, జడ్పీ సీఈఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్-జీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్‌ఏపీ) అమలుపై సమీక్షిస్తూ ప్రతి గ్రామపంచాయతీలో ఫామ్‌పాండ్లను వంద శాతం గుర్తించి, పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్‌ఈఆర్‌పీ-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, పశుసంవర్థక, ఉద్యానవన, మత్స్యశాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో కనీసం 50 ఎకో ఫామ్‌పాండ్లను చేపట్టాలని సూచించారు. తెలంగాణ జలసిరి కింద ఫామ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, బహిరంగ బావుల పునరుద్ధరణ వంటి నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. లక్ష్యాల సాధన కోసం అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు మండలస్థాయి అధికారులతో తరచూ సమీక్షలు చేపట్టి పనుల పురోగతిని నిశితంగా పర్యవేక్షించాలని దాన కిషోర్ ఆదేశించారు. అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్‌ఏపీ) మాన్యువల్ తయారీని త్వరగా పూర్తి చేసి, ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి మూడేళ్ల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!






