Gangula Kamalakar | కరీంనగర్ నిషేధిత ప్రాంతమా? కేటీఆర్ ఎందుకు రావొద్దు: గంగుల
Gangula Kamalakar | కరీంనగర్ (Karimnagar) నిషేధిత ప్రాంతం కాదని, ఇక్కడికి కేటీఆర్ (KTR) ఎందుకు రావొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. నన్ను, మా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారన్నారు. గంగులతో పాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Gangula Kamalakar | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్ (Karimnagar) నిషేధిత ప్రాంతం కాదని, ఇక్కడికి కేటీఆర్ (KTR) ఎందుకు రావొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. నన్ను, మా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా నేడు బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడంతో పట్టణ రాజకీయం అంతా వేడెక్కింది. గంగులతో పాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బండి సంజయ్‌కి తెలిసే దాడి జరిగింది..
అరెస్టు సమయంలో గంగుల మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలిసే కార్యాలయంపై దాడి జరిగింది. మమ్మల్ని అరెస్టు చేయడం మీద పెట్టే శ్రద్ధ కరీంనగర్‌పై పెడితే జువెలరీ దుకాణంలో చోరీ జరిగేది కాదు. ఇందులో పోలీసుల వైఫల్యం ఉంది. వారం రోజులు అవుతున్నా నిందితులను ఇంకా పట్టుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంగాధరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను గృహ నిర్బంధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మరోవైపు పట్టణ బంద్ వద్దని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సూచిస్తున్నారు. ఎవరూ బంద్ చేయాల్సిన అవసరం లేదంటూ బీజేపీ నేతలు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. బంద్ చేయొద్దంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్లో కొనసాగుతున్న బంద్.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS అరెస్టు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గంగుల కమలాకర్ గారిని ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన్ను… pic.twitter.com/rmUj2lThUm
— BRS Party (@BRSparty) May 9, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం





