Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
Garima Agrawal | జిల్లాలో తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎ
Garima Agrawal | జిల్లాలో తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి, హౌసింగ్ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులతో సాగు విస్తీర్ణం, ప్రస్తుతం సాగవుతున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, పట్టుపురుగుల పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఉపాధి, సాగు విధానాలను చేపట్టేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, మొక్కలు తదితర సామగ్రిని వ్యవసాయ, ఉద్యానవన, పట్టుపురుగుల శాఖలు సమన్వయంతో అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, విద్యాసంస్థల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని ఇళ్లు, భవనాల్లో కూడా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్త భవనాలకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినప్పుడే నిర్మాణ అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్‌వెల్‌ల రీచార్జ్ పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. భూగర్భ జలాల పరిరక్షణ, భవిష్యత్ నీటి అవసరాలపై రైతులకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖలు సంయుక్తంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటకుంటలు (ఫామ్ పాండ్లు), ఊటకుంటలు (పర్కొలేషన్ ట్యాంకులు) నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపైనా కలెక్టర్ సమీక్షించారు. తొలి దశలో మంజూరైన ఇళ్లలో ప్రారంభమైనవి, పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక, అర్హుల జాబితా సిద్ధీకరణ ప్రక్రియపై కూడా ఆరా తీశారు. ప్రతి ఇంటి నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల తదితర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ






