Supreme Court | ఈసీ చేపడుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court | ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ చట్టబద్ధమేనని స్పష్టం చేసింది.
Supreme Court | ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission)కు భారీ ఊరట లభించింది. సర్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఈసీ తీసుకుంటున్న చర్యలను సమర్థించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనని కోర్టు స్పష్టం చేసింది.
సర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఖచ్చితమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సర్ ఒక ముందడుగు అని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియ ఎన్నికల పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఉద్దేశించినదని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి (Representation of the People Act) జీవం పోస్తుందని పేర్కొంది.
SIRను నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన చట్టబద్ధమైన అధికారాల పరిధిని దాటి ప్రవర్తించలేదని కోర్టు స్పష్టం చేసింది. 'సాధారణంగా నిర్వహించే ప్రక్రియ కంటే ఇది భిన్నంగా ఉన్నంత మాత్రాన.. దీనిని చట్టవిరుద్ధం అనలేము' అని కోర్టు అభిప్రాయపడింది. సర్‌లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం కోల్పోరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన ‘SIR’ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వరుస పిటిషన్లపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
తీర్పు సందర్భంగా ‘SIR’పై నెలకొన్న వివాదాలను సుప్రీంకోర్టు నాలుగు ప్రశ్నలుగా విభజించింది. ఈ ప్రక్రియను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఉందా..?, ఈ ప్రక్రియ తగిన నిష్పత్తిలో మరియు చట్టబద్ధంగా సమర్థించదగినదేనా..?, ఇది 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించిందా..?, ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం పౌరసత్వాన్ని ఎన్నికల సంఘం పరిశీలించవచ్చా..? వంటి ప్రశ్నల ఆధారంగా ఈసీకి అనుకూలంగా సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ‘SIR’ చుట్టూ ఏడాది కాలంగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లైంది.
Also Read..
తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
బైజూ రవీంద్రన్‌కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
సంబంధిత వార్తలు

CJI Surya Kant | సెంటిమెంట్‌గా తీసుకోవద్దు.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వివాదంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
మే 25, 2026

Supreme Court | ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోలేదు.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు అసహనం
మే 25, 2026

KTR | హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు చూపెట్టు.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా: రేవంత్‌కు కేటీఆర్ సవాల్
మే 25, 2026
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష



