Pinarayi Vijayan | అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
Pinarayi Vijayan | కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఇవాళ సోదాలు చేపట్టారు.
Pinarayi Vijayan | కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఇవాళ సోదాలు చేపట్టారు. కొచ్చిన మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసుకు (corruption case) సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ఈడీ అధికారులు కేరళవ్యాప్తంగా సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు (ED raids) నిర్వహిస్తున్నారు. ఇందులో మాజీ సీఎం పినరయి నివాసం కూడా ఉంది.
ఈ కేసులో మాజీ సీఎం విజయన్ కుమార్తె వీణపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Exalogic Solutions Pvt Ltd), సీఎమ్ఆర్ఎల్ (Cochin Minerals and Rutile Limited) మధ్య రూ. 1.72 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ విచారణ జరుపుతోంది. దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, కోజికోడ్‌లోని వీణ భర్త, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసంలోనూ ఈడీ సోదాలు చేపడుతోంది. సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్త కుమారుడు శరణ్ కర్త ఇంట్లో కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది.
ఇదిలా ఉండగా ఈడీ సోదాలు అడ్డుకోవాలని సీఎమ్ఆర్ఎల్ సంస్థ కోర్టను ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్‌ను మంగళవారం కేరళ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం కావాలన్న కంపెనీ విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తిరస్కరించడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇక, ఈ కేసులో పినరయి విజయన్ పేరు ఎక్కడా లేకపోయినప్పటికీ సోదాలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
తెలంగాణలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. కొత్తమొల్గరలో అత్యధికంగా 11 సెం.మీ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..
- ●Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- ●Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
- ●MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్






