POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
POCSO Case | పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
POCSO Case | త్రినేత్ర.న్యూస్ : పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని వడ్లూరి పవన్(22) స్థానికంగా నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడరు. వీరిద్దరూ తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే బాలికను ఆమె తల్లిదండ్రులు నిలదీశారు. ఈ క్రమంలో 2022 జులై 16న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. బయటకు వచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆ మరుసటి రోజే బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకుని భరోసా సెంటర్‌కు తరలించారు.
మొత్తానికి ఈ కేసులో నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడు పవన్‌కు నాంపల్లి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్
- ●Traffic Advisory | బక్రీద్ పండుగ.. సాయంత్రం 5 నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Foreign Travel | విదేశీ టూర్లకు బ్రేక్.. ఇండియన్స్ ఖర్చు భారీగా తగ్గింపు..
- ●PM Modi | దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు

Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Traffic Advisory | బక్రీద్ పండుగ.. సాయంత్రం 5 నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు




