UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ నిరంతరాయంగా టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి దుష్ట శక్తులను భారత్‌పై ఉసిగొల్పుతోందని ఆరోపించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు ఇస్లామాబాద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
International | Published On May 27, 2026, 11.24 am IST
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ దేశంపై పాకిస్థాన్ కొనసాగిస్తున్న సరిహద్దు దురాక్రమణ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ (Islamabad) సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు ఇస్లామాబాద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఓ చర్చ సందర్భంగా పాక్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ భారత్‌ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పాక్ ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా అడ్డుకుంది. వాస్తవాలను ఐరాస వేదికగా ప్రపంచానికి వివరించింది. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఎండగట్టింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) మాట్లాడుతూ.. తమపై పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. "ఈ రోజు పాకిస్థాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలు, అనవసరమైన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ వాస్తవాలను స్పష్టం చేయాలనుకుంటోంది. స్వతంత్ర భారతదేశం ప్రారంభం నుంచే పాక్ సరిహద్దు దురాక్రమనను (cross border terrorism) న్యూ ఢిల్లీ ఎదుర్కొంటూ వస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదం, మతపరమైన తీవ్రవాదం, హింసాత్మక రాడికలిజానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తోంది. మా దేశంలో భాగమైన భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని పాక్ ఆశపడుతోంది.
భారత్‌ను లక్ష్యంగా చేసుకొని యుద్ధాలు, దురాక్రమణలు, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శాంతియుత సహజీవన సూత్రాలను పదేపదే ఉల్లంఘిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని వెయ్యి గాట్లతో భారతదేశాన్ని రక్తమోడేలా (bleeding India by a thousand cuts) చేయాలన్న పాక్ సిద్ధాంతం.. ఐరాస చార్టర్ పట్ల దానికి ఉన్న నిబద్ధత, డొల్లతనానికి నిదర్శనం" అని హరీశ్ పర్వతనేని ధ్వజమెత్తారు.
పాకిస్థాన్ నిరంతరాయంగా టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి దుష్ట శక్తులను భారత్‌పై ఉసిగొల్పుతోందని ఆరోపించారు. సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read..
బైజూ రవీంద్రన్‌కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
సంబంధిత వార్తలు

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
ఆగస్టు 13, 2026

UNSC | సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింస సరికాదు.. ఐరాసలో గళం విప్పిన భారత్
జులై 10, 2026

Indus Water Treaty | సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిలో మార్పులు లేదు.. పాక్‌కు స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
జులై 3, 2026
తాజావార్తలు
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ
- ●Advanced Tip | క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్.. ఇకపై ముందస్తు టిప్ కుదరదు..
- ●ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
- ●Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
- ●Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Google Pixel 11 | గూగుల్ పిక్సల్ 11 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయిన ఫీచర్లు..

Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Advanced Tip | క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్.. ఇకపై ముందస్తు టిప్ కుదరదు..

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం



