Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
Central Railway Stations | రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. సెంట్రల్ రైల్వే తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న చిన్న సంచారేతర క్యాటరింగ్ స్టాళ్లలో (minor static catering stalls) లభించే తినుబండారాల ధరలను సవరించింది (prices of food items). సవరించిన ధరల ప్రకారం.. జూన్ 1వ తేదీ నుంచి ఇడ్లీ, దోశ, సమోసా, వడ పావ్ వంటి తినుబండారాల కధరలు పెరగనున్నాయి.
Central Railway Stations | రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. వచ్చే నెల నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్లలో (Central Railway Stations) ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. సెంట్రల్ రైల్వే తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న చిన్న సంచారేతర క్యాటరింగ్ స్టాళ్లలో (minor static catering stalls) లభించే తినుబండారాల ధరలను సవరించింది (prices of food items). సవరించిన కొత్త ధరలు జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
సవరించిన ధరల ప్రకారం.. ఇకపై స్టేషన్లలో 50 గ్రాముల ఆలూ వడ ధరను రూ.15గా నిర్ణయించారు. దీంతో పాటు, సాధారణంగా వడతో కలిపి తినే ఒక ‘పావ్’ (Pav) ధర ఇకపై రూ.5గా ఉంటుంది. ఇక ఇతర స్నాక్స్ విషయానికొస్తే.. వెజ్ సమోసా, వెజ్ పఫ్, సాబుదానా వడలు ఇకపై ఒక్కొక్కటి రూ.20కి విక్రయించనున్నారు. ప్రయాణికులు ఎంతో ఇష్టంగా తినే పావ్ భాజీతోపాటూ వెజ్ పిజ్జా ధర కూడా పెరిగింది. కొత్త ధరల ప్రకారం వీటిని రూ.50 కి విక్రయించనున్నారు. ఇక సౌత్ ఇండియన్ ఫేమస్ టిఫిన్స్ విషయానికొస్తే (South Indian cuisine category).. మసాలా దోశ రూ.35, సాంబార్, చట్నీతో కలిపి ఇచ్చే రెండు ఇడ్లీల ధర రూ.30గా నిర్ణయించారు. మిసల్ పావ్ (రూ.35), కచోరీ (రూ.15), దాబేలి (రూ.20) వంటి కొన్ని ఆహార పదార్థాల ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.
ధరల పెంపుతోపాటూ విక్రయదారులు ఆహార నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని రైల్వే పరిపాలనా విభాగం ఆదేశించింది. అంతేకాదు, ప్రయాణికుల సౌకర్యార్థం స్టాల్స్ నిర్వాహకులు తమ దుకాణాల వద్ద రెండు భాషల్లో ధరల పట్టికను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. విక్రయదారులు ప్రయాణికుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడకుండా, ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించేందుకు స్టేషన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను రైల్వే పరిపాలనా విభాగం ఆదేశించింది.
Also Read..
దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
ఈసీ చేపడుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
తాజావార్తలు
- ●DK Shivakumar | మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం : కాంగ్రెస్ వర్గాలు
- ●HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష

DK Shivakumar | మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం : కాంగ్రెస్ వర్గాలు

HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..



