Supreme Court | ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోలేదు.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు అసహనం
Supreme Court | నీట్ యూజీ 2026 (NEET UG 2026) పేపర్ లీక్ వ్యవహారం (NEET Paper Leak)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court | నీట్ యూజీ 2026 (NEET UG 2026) పేపర్ లీక్ వ్యవహారం (NEET Paper Leak) దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనల నుంచి ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోలేదని పేర్కొంది. ఇది చాలా విచారకరం అని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, పేపర్ లీక్ ఘటనలతో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఏకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏకి బదులు ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా), యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (యూడీఎఫ్) సహా పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కేంద్రం, విద్యా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.
గతంలో (2024 పేపర్ లీక్ ఘటనను గుర్తు చేస్తూ) కూడా ఇదే అంశం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిందని, అప్పట్లో కోర్టు సూచనల మేరకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలయ్యాయా..? లేదా..? అన్న విషయంపై ఎన్టీఏ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. ఇందుకు గురువారం వరకూ కోర్టు సమయం ఇచ్చింది. ఇక ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
Also Read..
మే 26 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఏఐ పవర్‌తో అసుస్ కొత్త ఏఐఓ పీసీ.. తొలి స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఆలిన్ వన్ డెస్క్‌టాప్..
సంబంధిత వార్తలు

CJI Surya Kant | సెంటిమెంట్‌గా తీసుకోవద్దు.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వివాదంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
మే 25, 2026

Supreme Court| ట్విషా మృతి కేసు దర్యాప్తు.. ఆ కథనాలు తీవ్రంగా కలచివేశాయి: సుప్రీంకోర్టు
మే 25, 2026

CUET UG | మే 28న జరగాల్సిన సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
మే 25, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



