Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
Samsung | ఏఐ బూమ్ ప్రపంచ టెక్ రంగాన్ని ఊపేస్తుండగా, దాని భారీ లాభాలను ఇప్పుడు ఉద్యోగులు కూడా పంచుకోబోతున్నారు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన చిప్ డివిజన్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్యాకేజ్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.3.25 కోట్ల వరకు బోనస్ అందనున్నట్లు తెలిపింది.
Samsung | ఏఐ బూమ్ ప్రపంచ టెక్ రంగాన్ని ఊపేస్తుండగా, దాని భారీ లాభాలను ఇప్పుడు ఉద్యోగులు కూడా పంచుకోబోతున్నారు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన చిప్ డివిజన్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్యాకేజ్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.3.25 కోట్ల వరకు బోనస్ అందనున్నట్లు తెలిపింది. ఏఐ డేటాసెంటర్లకు భారీ స్థాయిలో మెమరీ చిప్‌ల డిమాండ్ పెరగడంతో శాంసంగ్ చిప్ వ్యాపారం గత త్రైమాసికంలో 49 రెట్ల లాభాలను నమోదు చేసింది. చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు అవసరమైన సర్వర్లలో ఉపయోగించే మెమరీ చిప్‌ల తయారీలో శాంసంగ్ ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ భారీ బోనస్ ప్యాకేజ్‌కు బుధవారం కంపెనీ అతిపెద్ద యూనియన్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం చిప్ డివిజన్‌లోని ప్రతి ఉద్యోగికి సగటున 5.13 కోట్ల వోన్‌లు, అంటే సుమారు రూ.3.25 కోట్ల బోనస్ లభించనుంది.
ఒప్పందానికి యూనియన్ మద్దతు..
శాంసంగ్ చిప్ డివిజన్‌లో సుమారు 78 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బోనస్‌ల కోసం కంపెనీ మొత్తం 26.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఇది ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగి బోనస్ ప్యాకేజీలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం రావడానికి ముందు ఉద్యోగులు 18 రోజుల సమ్మెకు హెచ్చరించారు. ఆ సమ్మె జరిగి ఉంటే శాంసంగ్ ఉత్పత్తులే కాకుండా ప్రపంచ మెమరీ చిప్ సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉండేది. యూనియన్ నిర్వహించిన ఓటింగ్‌లో 73.7 శాతం సభ్యులు ఒప్పందానికి మద్దతు తెలిపారు. దాదాపు 62,600 ఓట్లు నమోదయ్యాయి. అర్హులైన సభ్యుల్లో 95 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒప్పందం అమలుకు కనీసం సగానికి పైగా మద్దతు అవసరం ఉండగా, అది సులభంగా దక్కింది. ఇటీవలే శాంసంగ్ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటింది. ఆసియాలో ఈ ఘనత సాధించిన రెండో కంపెనీగా నిలిచింది. మొదటి స్థానంలో తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ ఉంది. ఏఐ బూమ్ కారణంగా మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడం శాంసంగ్ వృద్ధికి ప్రధాన కారణమైంది.
ఒక్కో ఉద్యోగి సగటు వేతనం రూ.1 కోటి..
ఈ బోనస్ అందరు శాంసంగ్ ఉద్యోగులకు కాదు. ప్రాసెసర్లు, ర్యామ్, మెమరీ చిప్‌లు తయారు చేసే సెమీకండక్టర్ విభాగానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ చిప్‌లను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, అలాగే భారీ ఏఐ డేటాసెంటర్లలో ఉపయోగిస్తారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన ఫైలింగ్‌లో 2025లో శాంసంగ్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం రూ.1 కోటి వరకు ఉందని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు ప్రకటించిన బోనస్ ఆ వార్షిక ఆదాయాన్ని పలుమార్లు మించిపోయింది. ఒప్పందం ప్రకారం సెమీకండక్టర్ విభాగం ఆపరేటింగ్ లాభాల్లో 10.5 శాతం ఉద్యోగులకు షేర్ల రూపంలో ఇవ్వనున్నారు. అదనంగా మరో 1.5 శాతం నగదు రూపంలో చెల్లించనున్నారు. అలాగే మరో మెమరీ చిప్ దిగ్గజం ఎస్‌కే హైనిక్స్ కూడా గతేడాది ఏఐ డిమాండ్ పెరగడంతో ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించింది.
సంబంధిత వార్తలు

Samsung Galaxy S25 Edge | రూ.47 వేల తగ్గింపుతో లభిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్.. అమెజాన్‌లో భారీ డీల్..
జులై 14, 2026

Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్ఫుల్ డిస్ప్లే..
జూన్ 30, 2026

Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. మ్యాక్‌బుక్‌ల ధరలు భారీగా పెంపు..
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి

TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!



