Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Rs 1,000 crore cocaine seized | గుజరాత్ (Gujarat) కచ్ తీరంలో (Kutch coast) 100 కేజీల కొకైన్‌ను అధికారులు స్వాధీనం (cocaine seized) చేసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1000 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
Rs 1,000 crore cocaine seized | గుజరాత్ (Gujarat coast) రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కచ్ తీరంలో (Kutch coast) 100 కేజీల కొకైన్‌ను అధికారులు స్వాధీనం (cocaine seized) చేసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1000 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
పాకిస్థాన్‌లోని పోర్ట్ ఖాసిం (Port Qasim) నుంచి వచ్చిన ఓ యూరోపియన్ నౌకలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) అధికారులు గుర్తించారు. వెంటనే రైడ్ నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డ్రగ్స్ ఏ మార్గం గుండా కచ్ తీరానికి వచ్చాయి, దీన్ని ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కాగా, దేశంలో వారం రోజుల్లో కొకైన్ పట్టుబడటం ఇది మూడోసారి. మే 23న ముంబై ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చిన ఓ జంట నుంచి 1.40 కిలోల కొకైన్ ఉన్న 84 క్యాప్సూల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు మే 19 ఇద్దరు ఆఫ్రికన్ దేశస్థుల నుంచి సుమారు రూ.4.25 కోట్ల విలువైన 850 గ్రాముల కొకైన్ ఉన్న మొత్తం 63 క్యాప్సూల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
జులై 17, 2026

Indigenous Hovercraft India | సముద్ర జలాల్లో మరింత పటిష్టంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్.. తొలి స్వదేశీ ‘హోవర్‌క్రాఫ్ట్’ ఎంట్రీ!
జూన్ 18, 2026

Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
మే 1, 2026
తాజావార్తలు
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు



