Byju Raveendran | బైజూ రవీంద్రన్‌కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
Byju Raveendran | ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు (Byjus Founder) బైజూ రవీంద్రన్ (Byju Raveendran)కు గట్టి షాక్ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ కోర్టు (Singapore court) ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Byju Raveendran | ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు (Byjus Founder) బైజూ రవీంద్రన్ (Byju Raveendran)కు గట్టి షాక్ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ కోర్టు (Singapore court) ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఏప్రిల్ 2024 నాటి తన ఆస్తులకు సంబంధించిన కోర్టు జారీ చేసిన పలు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించినందుకు గానూ రవీంద్రన్‌కు జైలు శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది.
అధికారుల ఎదుట వెంటనే లొంగిపోవాలని కోర్టు బైజూ రవీంద్రన్‌ను ఆదేశించింది. జైలు శిక్షతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం 90,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 68 లక్షలకు పైగా) తక్షణమే చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వివాదాస్పదంగా మారిన ‘బీయార్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్’ (Beaar Investco Pte) కంపెనీపై తనకు ఉన్న చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను, వాటాలను నిరూపించే పక్కా పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని రవీంద్రన్‌ను సింగపూర్ న్యాయస్థానం ఆదేశించింది.
బైజూస్ సంస్థ ఉద్యోగుల తొలగింపులు, ఖర్చుల తగ్గింపు చర్యల్లో ఉన్న తరుణంలో ‘ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ’ (QIA) ఇందులో పెట్టుబడులు పెట్టింది. అయితే, ఆ తర్వాత సంస్థలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, పారదర్శకత లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖతార్ ఇన్వెస్ట్‌హెంట్ అథారిటీకి చెందిన ఒక అనుబంధ సంస్థ.. సింగపూర్ కోర్టులో బైజూ రవీంద్రన్‌పై ఈ చట్టపరమైన కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బైజూ రవీంద్రన్‌కు శిక్ష ఖరారు చేసింది.
ఈ కేసులో ఖతార్ హోల్డింగ్స్ తరపున 'డ్రూ & నేపియర్' (Drew & Napier) సంస్థ, బైజూస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరపున 'ఫెర్వెంట్ ఛాంబర్స్' (Fervent Chambers) వాదనలు వినిపించాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని విదేశీ పెట్టుబడిదారుల నుండి వస్తున్న తీవ్రమైన చట్టపరమైన క్లెయిమ్‌లు, కేసులతో పోరాడుతున్న బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు విధించిన జైలు శిక్ష కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఇప్పటికే బైజూస్ సంస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. విదేశీయుల నుంచి సుమారు 1.2 బిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నట్లు బైజూస్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే సింగపూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రవీంద్రన్ ఇంకా స్పందించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియదు.
ఒకప్పుడు వేల కోట్లకు అధిపతి.. ఇప్పుడు జీరో
ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. 2011 లో రవీంద్రన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్‌లో పాఠాలు బోధించే ఈ స్టార్టప్‌కు తొలినాళ్లలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, కరోనా కాలంలో ఈ సంస్థకు దశ తిరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో బైజూస్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. 2022లో ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా రవీంద్రన్ ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. అయితే, కంపెనీ అనుసరించిన విధానాలు, సీఈవోగా రవీంద్రన్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. ఎంత వేగంతో పైకి ఎదిగిందో.. అదే వేగంతో ఒక్కసారిగా బైజూస్ విలువ కుప్పకూలిపోయింది. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన ఏడాది కూడా తిరగకముందే జీరోకు పడిపోవడం గమనార్హం.
Also Read..
అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కాసర్ల నాగేందర్ రెడ్డిపై సంఘ బహిష్కరణ.. ఆస్ట్రేలియా తెలుగు, తెలంగాణ సంఘాల సమాఖ్య
తెలంగాణలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. కొత్తమొల్గరలో అత్యధికంగా 11 సెం.మీ.
తాజావార్తలు
- ●Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..
- ●Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- ●Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
- ●MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్



