Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
Supreme Court | మేనరిక వివాహాలపై తగిన చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలించాలని, లేదా దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే అంశాలపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నోటీసులు జారీ చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : రక్తసంబంధీకుల (మేనరికం) మధ్య జరిగే వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నోటీసులు జారీ చేసింది. తగిన చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలించాలని, లేదా దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే అంశాలపై స్పందన తెలియజేయాలని కోరింది.
మేనరిక వివాహాల వల్ల పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, వైకల్యాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వివాహం అనేది వ్యక్తిగత ఎంపిక అని, ఇలాంటి వివాహాలను నియంత్రించడం లేదా నిషేధించడం న్యాయస్థానాల పరిధిలోకి రాదని తెలిపింది. ఇది పూర్తిగా పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ మేరకు ఇలాంటి వివాహాలపై తగిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చట్టం చేయడంతో పాటు రక్తసంబంధీకుల వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో (curriculum) చేర్చడం సహా వివిధ మార్గాల ద్వారా ప్రజలకు అవకాగహన కల్పించాలని సూచించింది. ఈ అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం తమ ఉద్దేశం కాదని సీజేఐ ధర్మాసనం తెలిపింది. తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ అంశంపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
Also Read..
మదురై కొండపై కార్తీక దీపం వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై కొండపై కార్తీక దీపం వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
నవంబర్ 20, 2026

Cauvery water | కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
నవంబర్ 20, 2026

Supreme Court | భారత్ సమ్మిట్‌లో ఓట్ చోరీ నినాదంపై పిల్.. విచారణకు సుప్రీం ఓకే
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ టార్గెట్.. దేశ జీడీపీలో 10 శాతం
- ●Trade License | వ్యాపారులు 30వ తేదీలోపు తమ ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాలి
- ●Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
- ●Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!
- ●Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- ●Ponnam Prabhakar | ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాతో ఆర్థిక భరోసా: పొన్నం ప్రభాకర్

CM Revanth Reddy | తెలంగాణ టార్గెట్.. దేశ జీడీపీలో 10 శాతం

Trade License | వ్యాపారులు 30వ తేదీలోపు తమ ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాలి

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..

Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!



