త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంబకు ఏసీ బస్సులు..!

AC Bus | శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రయాణ కష్టాలను తగ్గించే ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పంబకు చేరుకునేందుకు ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

P

Devotional | Published On Nov 20, 2026, 9.46 pm IST

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంబకు ఏసీ బస్సులు..!
Advertisement

AC Bus | శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రయాణ కష్టాలను తగ్గించే ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పంబకు చేరుకునేందుకు ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. తిరువనంతపురం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) ఈ సర్వీసులను నిర్వహించనుంది. తిరువనంతపురం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేరళ రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్‌ తొలి బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులకు పూలు, స్వామివారి చిత్రపటాలు అందించి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి దిగిన వెంటనే పంబకు వెళ్లేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని కల్పించారు.

టికెట్‌ ధరలు ఇవే..

తిరువనంతపురం విమానాశ్రయం నుంచి పంబకు ఒక్కొక్కరికి రూ.340, కొచ్చి విమానాశ్రయం నుంచి రూ.380గా టికెట్‌ ధర నిర్ణయించారు. తిరువనంతపురం నుంచి రాత్రి 9.30 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరిగి చేరుకుంటుంది. కొచ్చి నుంచి రాత్రి 8.30 గంటలకు సర్వీసు ప్రారంభమై, మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు విమాన ప్రయాణికులే కాకుండా ఇతర అయ్యప్ప భక్తులకు కూడా అవకాశం కల్పించారు. భక్తులు తమ ఇళ్లు లేదా స్థానిక దేవాలయాల వద్ద ఇరుముడి కట్టుకున్న తర్వాత నేరుగా పంబకు వెళ్లేందుకు కేఎస్‌ఆర్‌టీసీ మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వ్యక్తిగతంగా వెళ్లేవారితో పాటు కుటుంబాలు, భక్తుల బృందాలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక చార్టర్డ్‌ బస్సులను ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. దీంతో బస్సుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్‌ చేసుకునే వీలుంటుంది.

ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌

ప్రత్యేక బస్సుల టికెట్లను కేఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు విమాన టికెట్ల బుకింగ్‌ పోర్టల్స్‌ ద్వారా కూడా రిజర్వ్‌ చేసుకోవచ్చు. శబరిమల సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగే కొద్దీ అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు విమానాశ్రయం నుంచి పంబ వరకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశం.

Advertisement
Advertisement