Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీలను కొట్టివేసిన కోర్టు..
Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను (ఎస్‌ఎల్‌పీ) సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బకాయిపడిన మిల్లర్లపై చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది.
Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను (ఎస్‌ఎల్‌పీ) సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బకాయిపడిన మిల్లర్లపై చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించినట్లు తనిఖీల్లో గుర్తించారు.
ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు రావడంతో 2024 నుంచి అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్టర్ మిల్లర్లపై 540 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ పలువురు మిల్లర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు 2026 మేలో వాటిని కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు మిల్లర్లు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీలు దాఖలు చేశారు. తాజాగా వాటిని కూడా అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
డిఫాల్టర్ మిల్లర్లు తమ వద్ద ఉన్న బకాయి సీఎంఆర్ బియ్యాన్ని తక్షణమే పౌర సరఫరాల సంస్థకు అందించాలని, లేదంటే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం దుర్వినియోగం, సీఎంఆర్, పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద బకాయిల వసూలుకు చర్యలు చేపడతామని వెల్లడించింది. మిల్లర్ల న్యాయమైన సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వ ధాన్యం అక్రమ మళ్లింపుపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా
- ●Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!




