త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheetah | నాలుగు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన KOMG 3.. దేశంలో మ‌రింత పెరిగిన చీతాల కుటుంబం

Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్‌ (Kuno National Park)లో బోట్స్వానా (Botswana) నుంచి తీసుకొచ్చిన 'KOMG 3' అనే ఆడ చీతా నాలుగు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో భార‌త్‌లో చిరుతపుల‌ల సంఖ్య 62కు పెరిగింది.

D

National | Published On Nov 20, 2026, 1.54 pm IST

Cheetah | నాలుగు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన KOMG 3.. దేశంలో మ‌రింత పెరిగిన చీతాల కుటుంబం
Advertisement

Cheetah | త్రినేత్ర న్యూస్ : భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రాజెక్ట్ చీతా' మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్‌ (Kuno National Park)లో బోట్స్వానా (Botswana) నుంచి తీసుకొచ్చిన 'KOMG 3' అనే ఆడ చీతా నాలుగు కూన‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ఈ విషయాన్ని ఎక్స్ వేదిక‌గా అధికారికంగా ప్రకటించారు.

చీతా ప్రాజెక్టులో భాగంగా బోట్స్వానా నుంచి భారత్‌కు తరలించిన చీతాల్లో ప్రసవించిన మొదటి ఆడ చీతా ఇదేన‌ని తెలిపారు. రెండున్నరేళ్ల వయసున్న KOMG 3 నాలుగు నెలలకు పైగా బహిరంగ అటవీ ప్రాంతంలో సంచరించిన తర్వాత పూర్తి సహజ వాతావరణంలో ఈ కూనలకు జన్మనిచ్చిన‌ట్లు చెప్పారు. 2022లో ప్రాజెక్ట్ చీతా ప్రారంభమైనప్పటి నుండి ఓ చిరుత ఎన్‌క్లోజ‌ర్ల‌లో కాకుండా నేరుగా అడవిలో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ద‌క్షిణాఫ్రికా చిరుత గామిని అనే చిరుత‌కు 2024లో భార‌త్‌లో జన్మించిన 'KGP12' ఈ ఏడాది ఏప్రిల్ 11న తొలిసారి బహిరంగ అడవిలో నాలుగు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. KOMG 3 ప్ర‌స‌వంతో భార‌త్‌లో చిరుతపుల‌ల సంఖ్య 62కు పెరిగిన‌ట్లు కేంద్రం మంత్రి వెల్ల‌డించారు. వీటిలో 43 చిరుతపులులు మన దేశంలోనే జన్మించినవి కావడం విశేషం.

Also Read..

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు మాతృవియోగం

రాజీప‌డిన ప్ర‌ధాని ఎప్ప‌టికీ అక్క‌డ కూర్చోలేరు.. కేంద్ర ప్ర‌భుత్వంపై రాహుల్ విమ‌ర్శ‌లు

కావేరీ జ‌లాల వివాదం.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Advertisement
Advertisement