త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarguna Sagar | నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nagarguna Sagar | నాగార్జునసాగర్‌ జలాశయ భద్రతకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. బ్యాక్‌వాటర్‌ పరిధిలో చేపడుతున్న ఇంటెక్‌ వెల్‌ సంపు నిర్మాణ పనులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం కన్వీనర్‌ శ్యాం ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం రైట్‌ బ్యాంక్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని సందర్శించింది.

P

Telangana | Published On Nov 20, 2026, 9.15 pm IST

Nagarguna Sagar | నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా
Advertisement
  • ఇంటెక్‌ వెల్‌ సంపు పనులపై రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం పరిశీలన..
  • అనుమతులపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన బృందం

Nagarguna Sagar | నాగార్జునసాగర్‌ జలాశయ భద్రతకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. బ్యాక్‌వాటర్‌ పరిధిలో చేపడుతున్న ఇంటెక్‌ వెల్‌ సంపు నిర్మాణ పనులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం కన్వీనర్‌ శ్యాం ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం రైట్‌ బ్యాంక్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని సందర్శించింది. జలాశయ నిబంధనలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయా? నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఏ ప్రాతిపదికన మంజూరయ్యాయి? అనే అంశాలపై బృందం ఆరా తీసింది. ముఖ్యంగా ఇంటెక్‌ వెల్‌ సంపు నిర్మాణం వల్ల సాగర్‌ జలాశయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే కోణంలో పరిశీలించింది. నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు రక్షణకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

జలాశయ పరిధిలో నిర్మాణాలపై అమల్లో ఉన్న నిబంధనలు, అనుమతుల ప్రక్రియ గురించి అధికారులను ప్రశ్నించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డి.. ప్రాజెక్టు భద్రతకు విఘాతం కలిగించే పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఇంటెక్‌ వెల్‌ సంపు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జలాశయాలు కేవలం నీటి నిల్వ కేంద్రాలు మాత్రమే కాదని, ప్రజల అవసరాలు, వ్యవసాయం, భవిష్యత్‌ నీటి భద్రతతో ముడిపడి ఉన్న కీలక వనరులని.. వాటి రక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే, సాగర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి ముందు శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నెల్లికల్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టును సందర్శించింది. అక్కడి ప్రాజెక్టు పనులు, సంబంధిత అంశాలను పరిశీలించింది.

Advertisement
Advertisement