త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

Nasha Mukt Bharat | మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌’లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘హైదరాబాద్‌ వాక్స్‌ – నషా ముక్త్ భారత్‌’ పేరుతో ఈ నెల 21న మెగా ప్రిపరేటరీ సమావేశం నిర్వహించనున్నారు.

P

National | Published On Nov 20, 2026, 10.33 pm IST

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
Advertisement

Nasha Mukt Bharat | మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌’లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘హైదరాబాద్‌ వాక్స్‌ – నషా ముక్త్ భారత్‌’ పేరుతో ఈ నెల 21న మెగా ప్రిపరేటరీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్‌ కాలనీలో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

వీరితోపాటు పలువురు పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు నిర్వహించనున్న ‘హైదరాబాద్‌ వాక్స్‌ – నషా ముక్త్ భారత్‌’ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ప్రచార ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement
Advertisement