త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UAPA | యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

UAPA | ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ (UAPA) కేసుల్లో కూడా బెయిల్ అనేది ఒక‌ రూల్ అని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On May 18, 2026, 4.23 pm IST

UAPA | యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Advertisement

UAPA | ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ (UAPA) కేసుల్లో కూడా బెయిల్ అనేది ఒక‌ రూల్ అని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర‌ కేసు (Delhi riots case)లో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్ (Umar Khalid), షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్ నిరాకరిస్తూ గ‌తంలో జస్టిస్‌ అరవింద్ కుమార్, జస్టిస్‌ అంజారియా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన కేసుల్లో సైతం “బెయిల్ అనేది నిబంధన, జైలు అనేది మినహాయింపు” (bail is the rule and jail is the exception) అనే సూత్రం వర్తిస్తుందని తెలిపింది.

2020 సెప్టెంబ‌ర్ నుంచి జైల్లోనే మ‌గ్గుతున్న‌ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించడంలో విఫ‌లమైంద‌ని అభిప్రాయ‌ప‌డింది. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నప్పుడు.. కఠినమైన యూఏపీఏ చట్టం కింద కూడా నిందితుడికి బెయిల్ పొందే హక్కు ఉంటుందని జస్టిస్ బి.వి. నాగరత్న‌, జస్టిస్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నార్కో-టెర్రర్ కేసులో జూన్ 2020 నుంచి జైల్లో ఉన్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అనే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్య‌లు చేసింది.

ఫిబ్రవరి 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకులు ఉమర్ ఖాలిద్‌, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఢిల్లీ హైకోర్టు నిరాక‌రించింది. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్‌పై ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ అర‌వింద్ కుమార్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఖాలిద్‌, ఇమామ్‌కు బెయిల్ నిరాక‌రించింది. దీంతో త‌న సొంత తీర్పును సుప్రీంకోర్టు తాజాగా త‌ప్పుబ‌ట్టింది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Also Read..

నీట్ పేప‌ర్ లీక్‌లో మ‌రో అరెస్ట్‌.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌కు చేరిన ప్ర‌శ్న‌ప‌త్రం

భారీగా కుప్ప‌కూలినా.. రిక‌వ‌ర్ అయి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

పేరు ప్ర‌స్తావించ‌కుండానే.. విజ‌య్‌పై విమ‌ర్శ‌ల దాడిని ప్రారంభించిన స్టాలిన్‌..!

Advertisement
Advertisement