MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
MK Stalin | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మధ్య పట్టు సాధించేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేయలేదని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు.
MK Stalin | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మధ్య పట్టు సాధించేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేయలేదని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసి ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్ డీఎంకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పార్టీ మహాసభలు, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ గురించి ప్రస్తావించారు. అధికార టీవీకే పేరును ప్రస్తావించకుండానే స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
డీఎంకే తరహాలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పని చేయలేదన్నారు. అనేక ప్రాంతాల్లో కౌంటింగ్ ఏజెంట్లను కూడా నియమించలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలను ఉపయోగించి కుటుంబాలను ప్రభావితం చేశారని, ఈ విషయాన్ని అప్పట్లో ఎవరూ గుర్తించలేకపోయారని స్టాలిన్ అన్నారు. ఇప్పుడు ఆ వ్యూహాన్ని డీఎంకే పూర్తిగా అర్థం చేసుకుందని, భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 1949లో స్థాపించిన డీఎంకే పార్టీ ఎన్నికల్లో ఎన్నో విజయాలను, పరాజయాలను చూసిందన్న స్టాలిన్.. కానీ, ప్రతిసారి మరింత బలంగా ముందుకు వచ్చిందని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా ప్రతిపక్షానికి చెందిన అన్నాడీఎంకేకు చెందిన పలువురు పార్టీ సభ్యులు సైతం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



