NEET Paper Leak | నీట్ పేపర్ లీక్‌లో మరో అరెస్ట్.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌కు చేరిన ప్రశ్నపత్రం
NEET Paper Leak | నీట్ యూజీ 2026 పేపర్ లీక్ (NEET Paper Leak) వ్యవహారంలో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. అంతేకాదు, పేపర్ లీక్ వెనుక బ్యూటీషియన్ మనీషా వాఘ్మరే ఉన్నట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరేతో కలిసి మనీషా తెర వెను కథ మొత్తం నడిపినట్లు తేలింది.
NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ (NEET Paper Leak) వ్యవహారంలో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ (Latur)లోని శివనగర్ ప్రాంతంలో గల 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (Renukai Chemistry Classes) ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ (Shivraj Raghunath Motegaonkar)ను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. పరీక్షకు 10 రోజుల ముందే అంటే ఏప్రిల్ 23న ఎగ్జామ్ పేపర్ అతడికి చేరినట్లు సమాచారం.
ప్రశ్నపత్రం లీకేజీ, దానిని ఇతరులకు చేరవేసిన గ్యాంగ్‌లో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. అతడి ఫోన్‌లో లీకైన ప్రశ్నపత్రం కనిపించింది. అందులోని ప్రశ్నలు, సమాధానాలు అతను పలువురికి లీక్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో సీబీఐ అధికారులు శివరాజ్‌ను అరెస్ట్ చేశారు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలన కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్టైనవారితో శివరాజ్‌కు ఉన్న సంబంధాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది అరెస్టైన విషయం తెలిసింది. తాజా అరెస్ట్‌తో ఈ కేసులో మొత్తం 10 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
మాక్ టెస్ట్‌లలో ఒకే రకమైన ప్రశ్నలు
నివేదికల ప్రకారం.. శివరాజ్ నేతృత్వంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తన విద్యార్థులకు నిర్వహించిన మాక్ టెస్ట్‌లో ఇచ్చిన పలు ప్రశ్నలు.. మే 3న జరిగిన నీట్-యూజీ అసలు పరీక్షలోని ప్రశ్నలతో పూర్తిగా సరిపోలినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఓ విద్యార్థి తండ్రి గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తొలుత స్థానిక పోలీసులు విచారణ జరిపారు. ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారు.
పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్..!
ఇక ఈ పేపర్ లీక్ వెనుక బ్యూటీషియన్ మనీషా వాఘ్మరే ఉన్నట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. మహారాష్ట్రలోని పుణెలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఆమెను మే 14నే అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరేతో కలిసి మనీషా తెర వెను కథ మొత్తం నడిపినట్లు తేలింది. పేపర్ కొనేందుకు సరైన విద్యార్థులను మనీషానే గుర్తించి వారితో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
మహా న్యూస్‌పై ఉదయ్ కుమార్ ఫిర్యాదు.. క్రిమినల్ చర్యలకు డిమాండ్
రూ.50లక్షల బంగారం, ఎస్‌యూవీ కారు ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత బలవన్మరణం
రూ. 2500తో పుట్టగొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 3 కోట్లు గడిస్తున్న అన్నదమ్ముళ్లు..!
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






