Hyderabad | మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి
Hyderabad | 11 ఏళ్ల కుమారుడికి ఖరీదైన కారు స్టీరింగ్ ఇచ్చి ఓ తండ్రి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | 11 ఏళ్ల కుమారుడికి ఖరీదైన కారు స్టీరింగ్ ఇచ్చి ఓ తండ్రి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. టోలీచౌక్‌కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి ఇటీవలే ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఈనెల 11న అర్ధరాత్రి సమయంలో తన కుమారుడితో కలిసి డ్రైవ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిపై మైనర్ అయిన తన కుమారుడితో ఆ కారును డ్రైవింగ్ చేయించాడు. కుమారుడి డ్రైవింగ్ చూసి మురిసిపోయాడు.
అయితే, ఈ సంతోషంలో 11 ఏళ్ల బాలుడితో డ్రైవింగ్ చేయించడం చట్టరీత్యా నేరం అన్న సంగతి ఆ తండ్రి మర్చిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కారు యజమానిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. పిల్లలకు వాహనాలను ఇచ్చి.. కేసులు ఎదుర్కోవద్దని సూచిస్తున్నారు.
#HYDTPweBringAwareness
🚨 Minor Driving is a Serious Offence 🚨
A complaint received through social media regarding a minor driving an MG Cyberster on ORR was promptly verified by @shotr_rjnr . The vehicle was traced and apprehended along with the father of the minor and handed… pic.twitter.com/35c5BOePgG— Hyderabad Traffic Police (@HYDTP) June 18, 2026
Also Read..
పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..
నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
- ●Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..

Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ





