త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rangareddy | రూ.87కోట్ల‌తో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాప‌న‌

Rangareddy | రంగారెడ్డిలో కేంద్ర రహదారి నిధి (CRF) కింద సుమారు రూ.87 కోట్ల విలువైన రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు భ‌వ‌నాల‌శాఖ మంత్రి శంకుస్థాప‌న చేశారు. మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రులకు ఘన స్వాగతం పలికారు.

P

Hyderabad | Published On Jun 19, 2026, 6.29 pm IST

Rangareddy | రూ.87కోట్ల‌తో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాప‌న‌
Advertisement

Rangareddy | రంగారెడ్డిలో కేంద్ర రహదారి నిధి (CRF) కింద సుమారు రూ.87 కోట్ల విలువైన రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు భ‌వ‌నాల‌శాఖ మంత్రి శంకుస్థాప‌న చేశారు. మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రాంతమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. మ‌హేశ్వ‌రం, ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గాల్లో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం మెరుగ‌వ‌నుంది. కందుకూరు మండలం లేమూర్ గ్రామంలో రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 14 కిలోమీటర్ల డబుల్ లేన్ రహదారి నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

ఈ రహదారి లేమూరు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి వరకు తిమ్మాపూర్, అగర్మియాగూడ మీదుగా నిర్మించనున్నారు. ఈ మార్గం పూర్తయితే పరిసర గ్రామాలకు జాతీయ రహదారితో నేరుగా అనుసంధానం లభించనుంది. రవాణా సమయం తగ్గడంతో పాటు వాణిజ్య, విద్య, వైద్య సేవలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగనుంది. బేగంపేట‌లో మరో ర‌హ‌దానికి శంకుస్థాపన చేశారు. రూ.17 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల డబుల్ లేన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి బేగంపేట నుంచి ఎలిమినేడు వరకు మాదాపూర్ మీదుగా అభివృద్ధి కానుంది. గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిమ్మాపూర్‌లో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన 22 కిలోమీటర్ల రహదారిని మంత్రులు ప్రారంభించారు.

ఈ మార్గం ఆర్‌సీఐ గేట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు నిర్మాణం చేప‌ట్టారు. ఈ రహదారి రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాల మీదుగా వెళ్లడంతో, అనేక గ్రామాలకు నేరుగా కనెక్టివిటీ ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. రహదారి అభివృద్ధి పనుల ద్వారా మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానం బలోపేతం చేయడం, ప్రజల ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గ్రామాన్ని ప్రధాన రహదారి వ్యవస్థతో అనుసంధానించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement