Supreme Court | సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారిని ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
Supreme Court | దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను "పరాన్నజీవులు"గా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం, అలాంటి వ్యక్తుల పట్ల ఎలాంటి ఉపేక్ష చూపకూడదని స్పష్టం చేసింది.
Supreme Court | దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను "పరాన్నజీవులు"గా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం, అలాంటి వ్యక్తుల పట్ల ఎలాంటి ఉపేక్ష చూపకూడదని స్పష్టం చేసింది. ఒక సైబర్ మోసం కేసులో నిందితుడి బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వీ మోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఒకేచోట విచారించాలని నిందితుడు కోరగా, ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. ఈ అంశంలో తగిన హైకోర్టులను ఆశ్రయించవచ్చని సూచించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం సైబర్ నేరాల తీవ్రతను ప్రస్తావించింది. అమాయక మదుపరులు, సాధారణ ప్రజల నుంచి డబ్బు దోచుకుని వారిని ఆర్థికంగా నష్టపరుస్తున్న నేరగాళ్లను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి మోసాలు విస్తరిస్తుండడడం ఆందోళనకరమని అభిప్రాయపడింది. సైబర్ మోసాలకు పాల్పడే వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వారిని సులభంగా బయటకు అనుమతించడం కంటే జైల్లోనే ఉంచడం ప్రజా ప్రయోజనాలకు అనుకూలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు నుంచి జమ్మూకశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాల వల విస్తరిస్తోందని కూడా కోర్టు ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో "డిజిటల్ అరెస్ట్" పేరుతో జరుగుతున్న మోసాలు సహా అనేక రకాల సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తక్కువగా ఉన్న ప్రజలు ఈ మోసాల బారిన పడి భారీ మొత్తాలు కోల్పోతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు చట్టపరంగా మరింత కఠిన వైఖరి అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Christopher Nolan | తొలిసారిగా భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్.. వచ్చే నెలలో ముంబయిలో ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్
జూన్ 17, 2026

EHS | ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డుకు సభ్యులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..
జూన్ 17, 2026

MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●PM Modi Donald Trump | నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్‌కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్
- ●Christopher Nolan | తొలిసారిగా భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్.. వచ్చే నెలలో ముంబయిలో ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్
- ●Shubman Gill | శుభ్‌మన్ గిల్ రికార్డు.. వేగంగా 1000 రన్స్ చేసిన బ్యాటర్‌గా ఘనత
- ●TGMSIDC Review Telangana | ఆ రోగులకు ప్రభుత్వం అండ.. ఉచితంగా మందులు: దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు
- ●EHS | ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డుకు సభ్యులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..
- ●MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు

PM Modi Donald Trump | నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్‌కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్

Christopher Nolan | తొలిసారిగా భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్.. వచ్చే నెలలో ముంబయిలో ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్

Shubman Gill | శుభ్‌మన్ గిల్ రికార్డు.. వేగంగా 1000 రన్స్ చేసిన బ్యాటర్‌గా ఘనత

TGMSIDC Review Telangana | ఆ రోగులకు ప్రభుత్వం అండ.. ఉచితంగా మందులు: దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు



